Jackky Bhagnani : స్టార్ డైరెక్టర్ పై కేసు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. ఆ విషయంలో..
బాలీవుడ్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కేసు వేశారు.

Rakul Preet Singh Husband Jackky Bhagnani files a Case on Director Ali Abbas Zafar
Jackky Bhagnani : తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ కేసు వేశారు. బాలీవుడ్ లో సుల్తాన్, టైగర్ జిందా హై.. లాంటి పలు యాక్షన్ సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఇటీవల అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లతో బడే మియాన్ చోటే మియాన్ 2 తెరకెక్కించాడు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అయి కేవలం 120 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
ఈ సినిమాని పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఆజ్ ఫిలింస్ బ్యానర్‌లపై జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించారు. నిర్మాణంలో డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ కూడా భాగమయ్యాడు.
Also Read : Koratala Siva : ‘దేవర’ తర్వాత బన్నీ, మహేష్, ప్రభాస్.. అందర్నీ లైన్ లో పెట్టుకున్నాడుగా కొరటాల..
రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ పై.. నిర్మాణానికి ఇచ్చిన డబ్బులు సినిమా కోసం ఖర్చుపెట్టకుండా సొంతంగా, పర్సనల్ పనులకు వాడుకున్నాడు అని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. దీనిపై పోలీసులు అలీ అబ్బాస్ జాఫర్ కి నోటీసులు పంపారు. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో చర్చగా మారింది.