Koratala Siva : ‘దేవర’ తర్వాత బన్నీ, మహేష్, ప్రభాస్.. అందర్నీ లైన్ లో పెట్టుకున్నాడుగా కొరటాల..
దేవర తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేస్తాడు అని ఇప్పుడు చర్చగా మారింది.

Koratala Siva Interesting Comments on his next Movie after Devara Part 1
Koratala Siva : కొరటాల శివ రచయితగా చాలా సినిమాలకు పనిచేసి ప్రభాస్ మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. బాహుబలికి ముందు ప్రభాస్ కి మంచి పేరు, డబ్బులు తెచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత కొరటాల.. మహేష్ తో రెండు సినిమాలు తీసి హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ తో ఒక సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆచార్య ఫ్లాప్ అయినా ఇప్పుడు మళ్ళీ దేవర తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు.
అయితే దేవర తర్వాత కొరటాల శివ ఎవరితో సినిమా చేస్తాడు అని ఇప్పుడు చర్చగా మారింది. వెంటనే దేవర పార్ట్ 2 ఉంటుందా లేక ఎన్టీఆర్ చేతిలో ఉన్న సినిమాలు అయ్యాక దేవర 2 తీస్తాడా? ఈ లోపు ఎవరితో సినిమాలు చేస్తాడు అని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. గతంలో అల్లు అర్జున్ కొరటాల కాంబోలో ఒక సినిమా అధికారికంగా కూడా అనౌన్స్ చేసారు కానీ అది పట్టాలెక్కలేదు.
తాజాగా దేవర ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో అల్లు అర్జున్ తో కచ్చితంగా సినిమా ఉంటుంది. ఇప్పుడు పెద్ద సినిమాలు రెండు, మూడేళ్లు పడుతున్నాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. మహేష్ బాబుతో కూడా అన్ని కుదిరితే సినిమా చేయొచ్చు. ఆచార్య తర్వాత ప్రభాస్ నేను కలిసాము. కొన్ని కథల డిస్కషన్ కూడా మా మధ్య జరిగింది. ఆయన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఆయనతో సినిమా కుదురుతుందో లేదో చెప్పలేను కానీ ప్రభాస్ తో సినిమా కూడా ఉండొచ్చు అని తెలిపారు.
అయితే ఎన్టీఆర్ దేవర తర్వాత వెంటనే వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్నాడు. అవి అయ్యాకే దేవర పార్ట్ 2 ఉండొచ్చు. ఈ లోపు కొరటాల శివ ఒక సినిమా చేసి వస్తాడు. అయితే ఆ సినిమా బన్నీతోనే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మరి దేవర తర్వాత కొరటాల శివ ఏం చేస్తాడో చూడాలి.