Tollywood : టాలీవుడ్లో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ కలకలం
Tollywood : లేటెస్ట్గా ఈ సెన్సెటీవ్ ఇష్యూపై మరోసారి చర్చ స్టార్ట్ అయింది.
Casting Couch Controversy In Tollywood
Tollywood : క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణ సినిమా ఇండస్ట్రీకి చెరిగిపోని మచ్చ లాంటిది. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ టాపిక్ తెరపైకి రావడం, రచ్చ జరగడం..ఆ తర్వాత సమసిపోవడం కామన్ అయిపోయింది. లేటెస్ట్గా ఈ సెన్సెటీవ్ ఇష్యూపై మరోసారి చర్చ స్టార్ట్ అయింది. మేము వయసుకు వచ్చాం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నీతి టేలర్..ఇటీవల తనకు ఎదురైన ఓ సంఘటన గురించి బహిరంగంగా మాట్లాడటంతో సినీ వర్గాల్లో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.
మూవీ ఛాన్సెస్ కోసం ప్రయత్నించే సమయంలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు, ముఖ్యంగా మహిళా నటీమణులకు ఎదురయ్యే అనుభవాలపై మరోసారి చర్చ జరుగుతోంది. అయితే నీతి టేలర్ ఫేస్ చేసిన ఘటన ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతూ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఇలాంటి అంశాలు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు, స్టార్ హీరోల క్రేజ్తో తెలుగు సినిమా కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది.
మరోవైపు పరిశ్రమలో మహిళా నటీమణుల భద్రత, గౌరవం, అవకాశాల వంటి అంశాలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీతి టేలర్ వ్యాఖ్యలు ఇప్పుడు ఎలాంటి చర్చకు దారితీస్తాయి.? సినీ పరిశ్రమ నుంచి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
