సెలబ్రిటీలు.. దివాళీ ధగధగలు.. అమ్మ చీరతో డ్రెస్ కుట్టించుకున్న రితేశ్!

  • Published By: sekhar ,Published On : November 15, 2020 / 03:14 PM IST
సెలబ్రిటీలు.. దివాళీ ధగధగలు.. అమ్మ చీరతో డ్రెస్ కుట్టించుకున్న రితేశ్!

Updated On : November 15, 2020 / 4:28 PM IST

Celebrities Diwali Celebration: ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని సాంప్రదాయంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు.

ఇటీవల క్యాన్సర్‌ బారినపడిన ఈ ఖల్‌నాయక్‌ దాన్ని జయించి బయటపడ్డారు. తన సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్న సంజయ్‌దత్‌ ఈ ఏడాది దీపావళిని ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ దీపావళికి సంజయ్‌దత్‌ ఇంటికి ప్రత్యేక అతిథి వచ్చారు. ఆ అతిథి ఎవరో కాదు..


మలయాళ సూపర్‌స్టార్‌, ద కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్‌. స్నేహితుడు సంజయ్ దత్‌తో కలిసి ఇలా దీపావళిని సెలబ్రేట్‌ చేసుకోవడంపై మోహన్‌లాల్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఫొటోలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

Image

ముద్దుగుమ్మ పూజా హెగ్డే దివాళీ సంబరాలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది. సాంప్రదాయ వస్త్రధారణలో దీపాల కాంతుల మధ్య మెరిసిపోతున్న పూజ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


హీరోయిన్‌ జెనీలియా భర్త, బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌.. కుటుంబంతో కలిసి దీపావళి పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. రితేశ్‌, తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.Riteish Deshmukhఈ వీడియోలో ముగ్గురు ఒకే రకమైన డ్రెస్‌ వేసుకున్నారు. దీని గురించి రితేష్‌ ఆసక్తికరమైన సమాచారాన్ని కూడా ఇచ్చారు. తన తల్లి వైశాలి దేశ్‌ముఖ్‌ పాత చీరతో తాము ముగ్గురం డ్రెస్‌ కుట్టించుకున్నామని రితేశ్‌ తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)