Happy Journey : ఎమోషనల్ ఎంటర్టైనర్ హ్యాపీ జర్నీ ఫస్ట్ లుక్ రిలీజ్.. బండి సంజయ్ చేతుల మీదుగా..

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం హ్యాపీ జర్నీ.

Central Minister Bandi Sanjay launch Happy Journey poster

హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం హ్యాపీ జర్నీ. చైతన్య కొండా దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై గంగాధర్ పెద్ద కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను కేంద్ర మంత్రి బండి సంజ‌య్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ చిత్ర క‌థ‌ను విన్న త‌రువాత‌నే పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి అంగీక‌రించిన‌ట్లు తెలిపారు. ఇలాంటి సినిమా చేసిన ద‌ర్శ‌కుడిని అభినందిస్తున్న‌ట్లు చెప్పారు.

Actor Sriram : డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్‌..

Happy Journey first look

ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీలో అలజడులు, సామాజిక బాధ్యతల మీద స్పృహ ఉన్న ద‌ర్శ‌కుడు, మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు కలసి ఇలాంటి సినిమాలు తీయడం అభినందనీయమ‌న్నారు. హిందీ తెలుగు భాషలలో విడుదల కానున్న ఇలాంటి చిత్రాల‌కు ఎంతవరకైనా సహకరిస్తాను అని అన్నారు.

ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి కాగా.. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.