ఆ పిల్ల ఏడుస్తుంటే చేతికున్న వెంట్రుకలు లేచి నిలుచున్నాయి!..

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 12:28 PM IST
ఆ పిల్ల ఏడుస్తుంటే చేతికున్న వెంట్రుకలు లేచి నిలుచున్నాయి!..

Updated On : September 21, 2020 / 12:56 PM IST

Happy Birthday Kartikeya: ‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’, ‘ప్రతిరోజూ పండగే’, వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.. ‘‘చావు కబురు చల్లగా’’..


ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం (సెప్టెంబర్ 21) కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ‘‘చావు కబురు చల్లగా’’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.


ఈ మూవీలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. లావణ్య త్రిపాఠి కథానాయిక.. ఆమని కీలకపాత్ర పోషించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం కానుంది.