Chachhinaa Chaavani Premidi Lyrical : దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ‘సందేహం’ నుంచి ‘చచ్చినా చావని ప్రేమిది’ లిరికల్
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సత్యనారాయణ పర్చా నిర్మాత.

Chachhinaa Chaavani Premidi Song
Chachhinaa Chaavani Premidi Lyrical Song : విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సత్యనారాయణ పర్చా నిర్మాత. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ చేతుల మీదుగా ఈ పాట రిలీజైంది. ఈ కార్యక్రమంలో దశరథ్‌తో పాటు మన చౌదరి, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.
Veera Simha Reddy : వీరసింహుని విజయోత్సవం.. ఏపీలోని ఆ థియేటర్‌లో 200 డేస్ రన్ కంప్లీట్
ఈ సందర్భంగా డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ సతీష్ పరమదేవ తో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరికల్ సాంగ్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారి పాటను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత సత్యనారాయణగారు, హీరో సుమన్, హెబ్బా పటేల్ ఎంటైర్ టీమ్‌కు అభినందనలు అని అన్నారు.

Sandeham Movie team
మన చౌదరి మాట్లాడుతూ.. ‘‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడి అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.
సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తోన్న ఈ పాటను పూర్ణాచారి రాశారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్. శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు.