Chalapathi Rao : ముగిసిన చలపతి రావు అంత్యక్రియలు.. కన్నీరుమున్నీరు అవుతున్న రవిబాబు..

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు డిసెంబర్ 24 రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నేడు ఆయన అంతక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి. హిందూ సంప్రదాయాలతో రవిబాబు, తండ్రి చలపతి రావుకి అంత్యక్రియలు నిర్వహించాడు.

Chalapathi Rao : ముగిసిన చలపతి రావు అంత్యక్రియలు.. కన్నీరుమున్నీరు అవుతున్న రవిబాబు..

Chalapathi Rao's last rites are over

Updated On : December 28, 2022 / 11:03 AM IST

Chalapathi Rao : టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు డిసెంబర్ 24 రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తన విలక్షణమైన నటనతో తెలుగు వారి మదిలో సుస్థర స్థానం సంపాదించుకున్నారు చలపతి. అందర్నీ నవ్విస్తూ, నవ్వుతూ ఉండే చలపతి ఇకలేరు అన్న మాట విని సినీ నటులు, అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. నేడు ఆయన అంతక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరిగాయి.

Chalapathi Rao : నేడే చలపతి రావు అంత్యక్రియలు..

చలపతి రావు గారికి రవిబాబుతో పాటు ఇద్దరి కుమార్తెలు కూడా ఉన్నారు. వారు అమెరికాలో ఉండడంతో, వారు వచ్చే వరుకు చలపతి రావు భౌతికకాయాన్ని మహాప్రస్థానం ఫ్రీజర్‌లో నేటి వరకు ఉంచారు. మూడురోజులు తరువాత నేడు ఆయన అంతక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయాలతో రవిబాబు, తండ్రి చలపతి రావుకి అంత్యక్రియలు నిర్వహించాడు. ఎలక్ట్రికల్ మెషిన్‌పై తండ్రి చలపతి రావుని ఖననం చేస్తూ, రవిబాబు బోరుమని విలిపించాడు.

ఈ అంత్యక్రియలకు మంచు మనోజ్ కూడా హాజరయ్యి చలపతి రావుకి నివాళ్లు అర్పించాడు. కాగా చలపతి రావు 1200 పైగా సినిమాల్లో నటించారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులని తనదైన శైలిలో అలరించారు. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు.