Chandini Chowdary Santhana Prapthirasthu Teaser out now
తెలుగమ్మాయి చాందిని చౌదరి, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ సంతాన ప్రాప్తిరస్తు. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమతం, జీవన్‌కుమార్, తరుణ్ భాస్కర్, తాగుబోతు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈచిత్ర టీజర్‌ను విడుదల చేశారు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్న ఓ యువకుడు తన భార్యను గర్భవతిని చేయడానికి కష్టపడుతున్న కథలా అనిపిస్తోంది. ఈ టీజర్ ని సందీప్ రెడ్డి వంగ రిలీజ్ చేసారు.
Singer Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్..
100 రోజుల్లో గర్భవతిని చేయాలనే కండిషన్ పెట్టగా.. ఆ టైమ్‌లోగా అతడి భార్య గర్భవతి అయిందా లేదా అనే కథాంశంతో తెరకెక్కినట్లుగా కనిపిస్తోంది.
Paradise : వివాదంలో నాని ‘ప్యారడైజ్’..
సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి లు నిర్మిస్తున్నారు.