Singer Kalpana : క‌ల్పన ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో కొత్త ట్విస్ట్‌..

సింగ‌ర్ క‌ల్పన ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు.

Singer Kalpana : క‌ల్పన ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసులో కొత్త ట్విస్ట్‌..

A new twist in Singer Kalpana issue Argument between mother and daughter

Updated On : March 5, 2025 / 11:09 AM IST

ప్ర‌ముఖ సింగ‌ర్ క‌ల్ప‌న ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. కూక‌ట్‌ప‌ల్లిలోని హోలిస్టిక్ ఆస్ప‌త్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. బుధ‌వారం ఉద‌యానికి ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు. ఇప్ప‌టికే దీనిపై కేసు న‌మోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు ద‌ర్యాప్త‌లు చేప‌ట్టారు. ఈ రోజు క‌ల్ప‌న స్టేజ్‌మెంట్‌ను రికార్డు చేసే అవ‌కాశం ఉంది.

క‌ల్ప‌న‌ను ప‌రామ‌ర్శించిందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆస్ప‌త్రికి వెళ్లారు. సింగిర్ సునీత‌, గీతామాధురి, శ్రీకృష్ణ త‌దిత‌రులు అక్క‌డికి చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే?

మార్చి 4న క‌ల్పన నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. ఇంటి త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టిన‌ పోలీసులు అప‌స్మాప‌క స్థితిలో ఉన్న ఆమెను ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై ఇప్ప‌టికే ఆమె భ‌ర్త ప్ర‌సాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.

Paradise : వివాదంలో నాని ‘ప్యారడైజ్’..

మంగ‌ళ‌వారం సాయంత్రం క‌ల్ప‌న‌కు ఆమె భ‌ర్త ప్ర‌సాద్ ఫోన్ చేశారు. ఎంత‌కీ ఆమె లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో విల్లా సెక్ర‌ట‌రీకి ఫోన్ చేసి విష‌యం చెప్పారు. ఆయ‌న వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా.. ఇంటి త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టిన పోలీసులు ఆమెను ర‌క్షించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

కాగా.. మంగ‌ళ‌వారం క‌ల్ప‌న కేర‌ళ‌లో ఉంటున్న త‌న కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆమెను హైద‌రాబాద్‌కు రావాల‌ని కోరింది. అయితే.. తాను రాన‌ని కూతురు చెప్పింది. ఈ క్ర‌మంలో త‌ల్లీ, కూతుళ్ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌న‌స్థాపం చెందిన క‌ల్ప‌న మ‌ధ్యాహ్నాం మూడు గంట‌ల స‌మ‌యంలో తాను రోజు వేసుకునే నిద్ర మాత్ర‌ల‌ను అధిక‌మోతాదులో తీసుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింద‌ట‌. భ‌ర్త సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఫోన్ చేయ‌గా లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డంతో విల్లా సెక్ర‌ట‌రీకి కాల్ చేశాడు.

Raa Raja : ఆర్టిస్టుల ఫేస్ లు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’.. హారర్ సినిమా మూడు రోజుల్లో..

అస‌లు ఏం జ‌రిగిందనే పూర్తి క్లారిటీ అనేది క‌ల్ప‌న ని పోలీసులు విచారించిన త‌రువాత‌నే రానుంది.