Paradise : వివాదంలో నాని ‘ప్యారడైజ్’..

నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ది ప్యారడైజ్‌ మూవీ సినిమా గ్లింప్స్‌కు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది

Paradise : వివాదంలో నాని ‘ప్యారడైజ్’..

Nani 'Paradise' in controversy

Updated On : March 4, 2025 / 8:49 PM IST

పక్కింటి అబ్బాయి పాత్రలు, ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్‌ ఉన్న నాని.. ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు. వరుసగా అలాంటి స్టోరీలే సెలక్ట్ చేసుకుంటున్నాడు. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని చేస్తున్న ది ప్యారడైజ్ గ్లింప్స్‌.. సోషల్‌ మీడియాలో గోల పుట్టిస్తోంది. ఇది నానేనా.. నాని సినిమానేనా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇదేంటి నాని ఇలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు..

నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న ది ప్యారడైజ్‌ మూవీ సినిమా గ్లింప్స్‌కు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అదే సమయంలో అభ్యంతరాలు కూడా వినిపిస్తున్నాయ్. ఇది కడుపుమండిన కాకుల కథ అంటూ మొదలయ్యే గ్లింప్స్‌లో నాని లుక్‌ చూసి అవాక్కయిపోయి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్‌. నాని లుక్, డైలాగ్స్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలు పెంచేశాయ్. గ్లింప్స్ ఊర మాస్ లెవల్‌లో ఉందని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ఫైర్ అవుతున్నారు. పిక్చరైజేషన్, విజువల్స్, మ్యూజిక్ బానే ఉన్నా.. అందులో డైలాగ్‌లు మాత్రం అభ్యంతరంగా మారాయ్‌. దీనిపై నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు.

Raa Raja : ఆర్టిస్టుల మొహాలు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’.. హారర్ సినిమా మూడు రోజుల్లో..

గ్లింప్స్‌లో హీరో క్యారెక్ట‌ర్ ఎలివేట్ చేస్తూ వచ్చే డైలాగ్‌లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. తల్లిని కించపరిచేలా డైలాగ్‌లపై ఫైర్ అవుతున్నారు. నాని నుంచి ఇలాంటి డైలాగ్‌లు ఊహంచలేదని కొందరు అంటుంటే.. గ్లింప్స్ రిలీజ్‌ చేసే ముందు కుటుంబసభ్యులకు చూపించి వాళ్ల ఒపీనియన్ నాని తీసుకొని ఉంటే బాగుండేదంటూ ఫైర్ అవుతున్నారు మరికొందరు.

ఇంటర్నేషనల్ విమెన్స్‌ డే జరుపుకోబోతున్న టైమ్‌లో.. ఆడవాళ్ల గురించి ఇలాంటి చెత్త డైలాగ్ పెట్టటం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మహిళల ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగేలా డైలాగ్ ఉందని.. ఇలాంటివి పెట్టొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. స్లమ్ బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ అయినంత మాత్రానా.. ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి వీటిని నాని పట్టించుకుంటాడో లేదో చూడాలి.

Karthi Hospitalised : సర్దార్ 2 షూటింగ్ లో హీరో కార్తీకి గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

గ్లింప్స్‌పై అభ్యంతరాలు ఎలా ఉన్నా.. మంచి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ ఉంది నానికి. 2023లో దసరా సినిమాలో మొదటిసారి పూర్తిగా మాస్ అవతార్‌లో కనిపించినా.. ఆ తర్వాత హాయ్ నాన్నలాంటి క్లాస్ సినిమాతో అలరించాడు. ఇప్పుడు మళ్లీ మాస్ జపం చేస్తున్నాడు. వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. సరిపోదా శనివారం అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను పలకరించాడు. హిట్‌ 3తో పాటు.. ది ప్యారడైజ్ అంటూ మాస్‌ మసాలా స్టోరీలకు ఓకే చెప్పేశాడు.