Raa Raja : ఆర్టిస్టుల ఫేస్ లు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’.. హారర్ సినిమా మూడు రోజుల్లో..

ఈ సినిమాలో అసలు ఆర్టిస్టుల మొహాలే చూపించరట.

Raa Raja : ఆర్టిస్టుల ఫేస్ లు చూపించకుండా సినిమా.. ‘రా రాజా’.. హారర్ సినిమా మూడు రోజుల్లో..

Horror Thriller Movie Raa Raja Directed Without Showing Artists Faces

Updated On : March 5, 2025 / 10:21 AM IST

Raa Raja : అసలు సినిమాలకు వచ్చేదే చాలా మంది నటీనటుల మొహాలు చూసి. హీరో, హీరోయిన్స్ ఎవరో తెలుసుకొని కూడా సినిమాకు వెళ్తాము. కానీ ఈ సినిమాలో అసలు ఆర్టిస్టుల మొహాలే చూపించరట. మొహాలు చూపించకుండా సినిమా తీయడం మామూలు విషయం కాదు. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన సినిమా ‘రా రాజా’. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Also Read : Naari Movie : ఉమెన్స్ డే స్పెషల్.. నారి సినిమా ఆఫర్.. ఒక టికెట్ కొంటె ఒక టికెట్ ఫ్రీ..

తాజాగా మూవీ యూనిట్ మీడియాతో మాట్లాడుతూ తమ సినిమా గురించి మాట్లాడారు. డైరెక్టర్ బి. శివ ప్రసాద్ మాట్లాడుతూ .. నిర్మాతగా సినిమాలు చేస్తున్న టైంలో నా మైండ్‌లోకి వచ్చిన పాయింట్‌ను కథగా మార్చాను. అలా అనుకోకుండానే నేను దర్శకుడిగా అయ్యాను. ఇప్పటి వరకు సినిమా చూసిన వారంతా మెచ్చుకున్నారు. ఈ సినిమా మార్చి 7న రాబోతోంది అని అన్నారు.

Horror Thriller Movie Raa Raja Directed Without Showing Artists Faces

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. రా రాజా సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చే స్కోప్ దక్కింది. శివ ప్రసాద్ గారు నాకు నిర్మాతగా ఎప్పటి నుంచో తెలుసు. రా రాజా కథ గురించి చెప్పినప్పుడు నిర్మాతగా చెబుతున్నారని అనుకున్నా కానీ దర్శకుడిగా అని తర్వాత తెలిసింది. మొహాలు చూపించకుండా కథ చాలా బాగా నడిపారు. సినిమా బాగా వచ్చింది అని అన్నారు. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఓ కొత్త కాన్సెప్ట్ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా చూసేయండి..