Naari Movie : ఉమెన్స్ డే స్పెషల్.. నారి సినిమా ఆఫర్.. ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ..

నారి సినిమా ప్రేక్షకులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.

Naari Movie : ఉమెన్స్ డే స్పెషల్.. నారి సినిమా ఆఫర్.. ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీ..

Naari Movie Womens Day Special Offer

Updated On : March 4, 2025 / 7:54 PM IST

Naari Movie : ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ యూనిట్స్ పలు ఆఫర్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న నారి సినిమా మార్చ్ 7న రిలీజవుతుండగా, మార్చ్ 8న మహిళా దినోత్సవం ఉండగా, సినిమా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా కావడంతో ప్రేక్షకులకు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.

Also Read : Karthi Hospitalised : సర్దార్ 2 షూటింగ్ లో హీరో కార్తీకి గాయం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..

ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘నారి’. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి.. లాంటి వుమెన్ ఎంపవర్మెంట్ కథాంశంతో శశి వంటిపల్లి నిర్మాణంలో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

naari

మార్చ్ 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు మూవీ యూనిట్. 7వ తేదీన, 8వ తేదీన అన్ని షోస్ కు ఈ ఆఫర్ వర్తించనుంది. టికెట్స్ సమీపంలోని థియేటర్లలో లేదా బుక్ మై షో ద్వారా కూడా ఈ ఆఫర్ తో బుక్ చేసుకోవచ్చు.

Also Read : Seethamma Vakitlo Sirimalle Chettu : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా..? పెద్దోడు – చిన్నోడు రెడీ..

అలాగే ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, ట్రైలర్ రిలీజవ్వగా తాజాగా మరో సాంగ్ ని రిలీజ్ చేసారు. వినోద్ విన్ను సంగీత దర్శకత్వంలో భాస్కరభట్ల లిరిక్స్ రాయగా సింగర్ సునీత పాడిన ‘హవాయి హవాయి హవా..’ సాంగ్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ మెలోడీ సాంగ్ వినేయండి..