Vayuputra : టాలీవుడ్ నుంచి ‘వాయుపుత్ర’.. హ‌నుమంతుడిపై 3D యానిమేషన్ మూవీ..

చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మూవీ వాయుపుత్ర (Vayuputra).

Chandoo Mondeti Vayuputra 3d animation movie

Vayuputra : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వాయుపుత్ర’ (Vayuputra) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్నట్లుగా ఉంది.

భారీస్థాయిలో 3D యానిమేషన్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్ర‌పంచ వ్యాప్తంగా 2026 ద‌స‌రాకు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Bhadrakaali Trailer : ఆకట్టుకుంటున్న విజ‌య్ ఆంటోనీ ‘భ‌ద్రకాళి’ ట్రైల‌ర్‌..

ఇది కేవలం సినిమా కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యం. మునుపెన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంలో ముంచేయడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. ‘వాయుపుత్ర’ ఒక సినిమాటిక్ మైలురాయిగా మరియు విశ్వాసం, శౌర్యం, విధి యొక్క వేడుకగా మారనుంది అని చిత్ర బృందం చెబుతోంది.

Akhanda 2 : శివుడిగా బాల‌య్య‌.. విలన్‎గా సంజయ్ దత్!

‘వాయుపుత్ర’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పింది.