Chandra Mohan : రాజేంద్రప్రసాద్, జయసుధలతో చంద్రమోహన్ హిట్ కాంబినేషన్లు

చంద్రమోహన్ కెరియర్లో ఎంతోమంది హీరోయిన్లతో, హీరోలతో నటించారు. అయితే జయసుధ, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాల్లో నటించారు. వీరిద్దరితో ఆయన నటించిన సినిమాలు హిట్ అందుకున్నాయి.

Chandra Mohan

Chandra Mohan : నటనే జీవితంగా మలుచుకున్న గొప్ప నటుడు చంద్రమోహన్. వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. చంద్రమోహన్ తో నటించిన నటీమణుల్లో చంద్రమోహన్-జయసుధ హిట్ పెయిర్ గా నిలిచారు. వీరిద్దరూ అత్యథిక సినిమాల్లో జోడిగా నటించారు. ఇక చంద్రమోహన్-రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రాగా చాలా సినిమాల్లో ఇద్దరు నవ్వులు పూయించారు.

వైవిధ్యమైన పాత్రల్లో వందలాది సినిమాలో నటించిన చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం సినిమా పరిశ్రమను విషాదంలో నింపేసింది. నటనే జీవితంగా మలుచుకున్న గొప్ప నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది. చంద్రమోహన్ చాలామంది హీరోయిన్లతో నటించారు. అప్పట్లో కొత్తవారంతా చంద్రమోహన్ పక్కన జోడిగా నటించినవారే. అయితే జయసుధతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో చంద్రమోహన్. ఇద్దరు 34 సినిమాల్లో నటించారు. ఆ తర్వాత లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి కూడా పది నుంచి పదిహేను సినిమాల వరకు ఆయనతో కలిసి నటించారు.

Chandra Mohan : కొత్త హీరోయిన్లకు లక్కీ హీరో.. అప్పటి టాప్ హీరోయిన్లంతా చంద్రమోహన్‌తో నటించినవారే..

నటి జయసుధ కెరియర్ చంద్రమోహన్ కి జోడిగా ‘ప్రాణం ఖరీదు’ తో మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి 34 సినిమాల్లో నటించారు. అలా చంద్రమోహన్-జయసుధకు హిట్ కాంబినేషన్ గా పేరుంది. జయసుధతో అమ్మాయి మనసు, శ్రీమతి ఒక బహుమతి, స్వర్గం, ఇంటింటి రామాయణం, గోపాలరావుగారి అమ్మాయి, ఆక్రందన, కలియుగ స్త్రీ, రేపటి కొడుకు, పక్కింటి అమ్మాయి, కలికాలం వంటి సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన చాలా సినిమాల్లో ఈ జంట కనువిందు చేసింది.

చంద్రమోహన్-రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జయమ్ము నిశ్చయమ్మురా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో చంద్ర మోహన్ రాజేంద్రప్రసాద్ ఇద్దరు హీరోస్ గా నటించారు. జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. జూ లకటక, పెళ్లిచేసి చూపిస్తాం, చిన్నోడు పెద్దోడు, నాకు పెళ్లాం కావాలి, జయమ్ము నిశ్చయమ్మురా, రెండు రెళ్లు ఆరు, ఆడపిల్లలే నయం, డామిట్ కథ అడ్డం తిరిగింది
ముచ్చటగా ముగ్గురు, పవిత్ర ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు.

Chandra Mohan : చంద్రమోహన్ చివరి మాటలు..

ఇక చంద్రమోహన్ చేయని పాత్ర లేదని చెప్పాలి. హీరోగా, సెకండ్ హీరోగా, అన్నగా, తమ్ముడిగా, తండ్రిగా ఏ పాత్రలో అయినా తనదైన నటనను ప్రదర్శించేవారు. లవ్, కామెడీ, ట్రాజెడీ, ఏ ఎమోషనల్ అయినా తన పాత్రలో పలికించేవారు చంద్రమోహన్. తెలుగు తెరపై తనదైన నటనతో, తనదైన స్ధానాన్ని ఏర్పాటు చేసుకుని చెరగని సంతకం చేసి దివికేగారు చంద్రమోహన్.