Chandra Mohan : చంద్రమోహన్ చివరి మాటలు..

చంద్రమోహన్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించిన గొప్ప నటుడు తమ మధ్య లేరనే వార్తను అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రమోహన్ కడసారి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Chandra Mohan : చంద్రమోహన్ చివరి మాటలు..

Chandra Mohan Last Words

Updated On : November 11, 2023 / 12:15 PM IST

Chandra Mohan : ప్రముఖ నటుడు చంద్రమోహన్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించినప్పుడు చంద్రమోహన్ మీడియాతో మాట్లాడారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవే జనం మధ్యలో కడసారిగా ఆయన మాట్లాడిన మాటలు..

Chandra Mohan : తెలుగు సినిమాల్లో నాన్న పాత్రలంటే ఆయనే చేయాలి.. ఆ సినిమాలో అయితే జీవించేశారు..

సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రల్ని పోషించిన చంద్రమోహన్ దాదాపుగా 932 సినిమాల్లో నటించారు. హీరోగా, సెకండ్ హీరోగా, కమెడియన్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

చంద్రమోహన్ వయసు 81 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2 న కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన సందర్భంలో చంద్రమోహన్ ఆయనకు నివాళులు అర్పించారు. కె.విశ్వనాథ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో అందరికంటే కె.విశ్వనాథ్‌కు తాను దగ్గరి వాడినని తమది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పారు చంద్రమోహన్. సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, ఓ సీత కథ వంటి సినిమాల ద్వారా నటుడిగా తను ఎదడగానికి విశ్వనాథ్ ఎంతో సపోర్ట్ చేసారన్నారు చంద్రమోహన్.

Chandra Mohan : తల్లి చనిపోయినా షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..

1966 లో బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా, కె.విశ్వనాథ్ డైరెక్టర్‌గా , తాను నటుడిగా ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి వచ్చామని గుర్తు చేసుకున్నారు చంద్రమోహన్. అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్ డైరెక్షన్‌లో తాను పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా చెప్పారు. కళాతపస్విని తల్చుకుంటూ చంద్రమోహన్ మాట్లాడిన ఆ మాటలే జనం మధ్యలో ఆయన మాట్లాడిన చివరి మాటలుగా మిగిలిపోయాయి.