Acharya: అడవిలో చిరుతో చరణ్.. స్టిల్‌కు అభిమానులు ఫిదా!
మెగా అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దానికి కారణం తండ్రి చిరంజీవితో కలిసి తనయుడు రామ్ చరణ్ నటిస్తూ ఆ వివరాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Acharya (1)
Acharya: మెగా అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుష్ అవుతున్నారు. దానికి కారణం తండ్రి చిరంజీవితో కలిసి తనయుడు రామ్ చరణ్ నటిస్తూ ఆ వివరాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు. సోషల్ ఎలిమెంట్స్ ను పక్కా కమర్షియల్ స్క్రీన్ ప్లేలో జోడించి ప్రేక్షకులకు కిక్కిచ్చేలా సినిమాను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు ఆచార్య సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరు, కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తుండగా.. రామ్ చరణ్-పూజ హెగ్డే మరో ప్రధాన ప్రత్యేక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తికాగా ఈ విషయాన్ని బీఏ రాజు టీం ట్విటర్ ద్వారా తెలియజేసింది. పనిలో పనిగా తండ్రి, తనయుల ఫోటో ఒకదాన్ని కూడా షేర్ చేశారు. అడవిలో వాగు అంచున ఓ చెట్టు కింద రాయిపై కామ్రేడ్ గెటప్స్ లో చిరు, చరణ్ కూర్చున్న స్టిల్ ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తుంది.
కాగా, ఇక మిగిలిన ఆ రెండు పాటలను కూడా ఈ నెలలో పూర్తిచేసి ఎంత వీలయితే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ఇప్పుడు విడుదల చేసిన పిక్ చూస్తే ఇది నక్సల్ ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రజెంట్ అంశాల చుట్టూ తిరిగే కథగా కనిపిస్తుంది. ఇక, ఈ సినిమా పూర్తయితే చిరంజీవి లూసిఫర్ రీమేక్ పనిలో ఉండనున్నట్లు తెలుస్తుంది.
Talkie of the most awaited film #Acharya has been completed. Shooting of two songs is yet to be completed.
Megastar @KChiruTweets @AlwaysRamCharan #KoratalaSiva @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @DOP_Tirru @NavinNooli @sureshsrajan #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/ZfW0WXFWLs
— BARaju's Team (@baraju_SuperHit) August 4, 2021