చిచ్చొరే – జ్యూక్ బాక్స్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న'చిచ్చొరే'.. ఫుల్ ఆల్బమ్ రిలీజ్..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న’చిచ్చొరే’.. ఫుల్ ఆల్బమ్ రిలీజ్..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ.. ‘చిచ్చొరే’.. కాలేజ్ లైఫ్‌లో, అపరిచిత వ్యక్తులుగా పరిచయం అయిన వాళ్లు ప్రాణ స్నేహితులుగా మారాక.. వాళ్ల అనుభూతులు, అనుభవాలు ఎలా ఉంటాయి అనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారీ డైరెక్ట్ చెయ్యగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రిలీజ్ చేసిన చిచ్చొరే ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
రీసెంట్‌గా చిచ్చొరే ఆడియో ఫుల్ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ప్రీతమ్ కంపోజ్ చేసిన ‘వో దిన్ ది క్యాన్ దిన్ దే’ సాంగ్‌తో స్టార్ట్ అయిన ఈ ఆల్బమ్‌లో ‘వో దిన్ ది క్యాన్ దిన్ దే’ ఆర్జిత్ సింగ్ వెర్షన్‌తో కలిపి మొత్తం ఏడు పాటలున్నాయి.. చదువు పూర్తయ్యాక వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఏడుగురు ఫ్రెండ్స్.. పాతికేళ్ల తర్వాత కొన్ని క్లిష్ట పరిస్థితులలో కలుస్తారు. అందరూ కలిసి ఆ పరిస్థితిని ఎలా చక్కదిద్దారు అనే కాన్సెప్ట్‌తో చిచ్చొరే రూపొందింది. 1992 నుండి 2019 వరకు కథ జరుగుతుంది.
Read Also : ఇట్టిమాణి – ట్రైలర్..
వరుణ్ శర్మ, ప్రతీక్ బబ్బర్, తుషార్ పాండే, తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి (ఏజెంట్ ఆచార్య ఆత్రేయ ఫేమ్) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 6న చిచ్చొరే విడుదల కానుంది. మ్యూజిక్ : ప్రీతమ్, సినిమాటోగ్రఫీ : అమలేందు చౌదరి, ఎడిటింగ్ : చారు శ్రీ రాయ్, రైటింగ్ : నితేష్ తివారీ, పియూష్ గుప్తా, నిఖిల్ మల్హోత్రా.