చీకటి గదిలో చితక్కొట్టుడు – ట్రైలర్
చీకటి గదిలో చితక్కొట్టుడు - ట్రైలర్ రిలీజ్.

చీకటి గదిలో చితక్కొట్టుడు – ట్రైలర్ రిలీజ్.
అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాల స్పూర్తితో, అడల్ట్ కంటెంట్‌ని బేస్ చేసుకుని, అదే రూట్‌లో మరికొన్ని సినిమాలొస్తున్నాయి. ఇప్పుడు అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలను మించి, చీకటి గదిలో చితక్కొట్టుడు.. అనే సినిమా రాబోతుంది. అథిత్ అరుణ్, మిర్చి హేమంత్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలి మొయిన్ లీడ్స్‌గా, బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై, సంతోష్ పి జయకుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చీకటి గదిలో చితక్కొట్టుడు టీజర్ చూసిన వాళ్ళంతా, ఇదేం సినిమా, ఇదేం టీజర్ అని షాక్ అయ్యారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి ఈ ట్రైలర్ ప్రదర్శన నిషేదింప బడింది అనే హెచ్చరికతో, సినిమాలోనూ, ట్రైలర్‌లోనూ మాంచి హాట్ అండ్ ఘాటు మసాలా ఉండబోతోందని హింట్ ఇచ్చింది మూవీ యూనిట్. టీజరే అనుకుంటే, దాని బాబులా ఉందీ ట్రైలర్.. అడల్ట్ హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ అంతా.. భీభత్సమైన ఎక్స్‌పోజింగ్, భయంకరమైన డబుల్ మీనింగ్ డైలాగులతో, బూతు మయంగా ఉంది.
ఆ చెండాలాన్ని, సారీ, ట్రైలర్‌ని చూసి తరించండి మరి.
వాచ్ ట్రైలర్…