Marnus Labuschagne : చరిత్ర సృష్టించిన మార్నస్ లబుషేన్.. పింక్ బాల్ టెస్టు క్రికెట్‌లో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) అరుదైన ఘనత సాధించాడు.
Marnus Labuschagne achieves record-breaking feat in Brisbane
Marnus Labuschagne : ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ బాల్ (డే/నైట్) టెస్టు మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
గబ్బా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 42 పరుగుల వద్ద అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో లబుషేన్ 78 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 72 పరుగులు సాధించాడు.
పింక్ బాల్ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
* లబుషేన్ – 10 మ్యాచ్‌ల్లో 1030 పరుగులు
* స్టీవ్ స్మిత్ – 14 మ్యాచ్‌ల్లో 827* పరుగులు
* డేవిడ్ వార్నర్ – 9 మ్యాచ్‌ల్లో 753 పరుగులు
* ట్రావిస్ హెడ్ – 11 మ్యాచ్‌ల్లో 752 పరుగులు
* జోరూట్ – 8 మ్యాచ్‌ల్లో 639 పరుగులు
Marnus Labuschagne becomes the first player to score 1000 runs in day-night Test cricket 👏
1003* – Marnus Labuschagne
827* – Steve Smith
753 – David Warner
752 – Travis Head
639 – Joe Root#AUSvENG #Ashes pic.twitter.com/GZ4oeRQ2WY— ESPNcricinfo (@ESPNcricinfo) December 5, 2025
IND vs SA : విశాఖలో టీమ్ఇండియా రికార్డు ఎలా ఉందో తెలుసా? సిరీస్ పోరులో విజేతగా నిలిచేది ఎవరంటే?
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జో రూట్ (138 నాటౌట్; 206 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీశాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ రెండో రోజు డిన్నర్ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (24), కామెరూన్ గ్రీన్ (22) లు క్రీజులో ఉన్నారు.
