Anikha surendran : హీరోయిన్ గా మారిన బాలనటి.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. ఏమంటుందో తెలుసా??

అనికా సురేంద్రన్ మాట్లాడుతూ.. నేను చాలా ఏళ్లుగా బాలనటిగా నటిస్తున్నాను. ఇప్పుడు హీరోయిన్ గా తెలుగులో, పెద్ద బ్యానర్ లో పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. మలయాళంలో కప్పేలా సినిమా చూశాను. సినిమా నచ్చింది. ఆ రీమేక్ సినిమాలో.............

Anikha surendran : హీరోయిన్ గా మారిన బాలనటి.. తెలుగు సినిమాతో ఎంట్రీ.. ఏమంటుందో తెలుసా??

Child Artist Anikha surendran turned as Heroine with Buttbomma Movie

Updated On : January 20, 2023 / 7:10 AM IST

Anikha surendran :  మలయాళంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన అనికా సురేంద్రన్ మలయాళం, తమిళ్, తెలుగులో దాదాపు 20 సినిమాలు బాలనటిగా చేసింది. చివరగా నాగార్జున ది ఘోస్ట్ సినిమాలో బాలనటిగా మెప్పించింది అనికా. ఇప్పుడు వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. మలయాళ భామ అయిన అనికా తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన కప్పేలా సినిమాని తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ మేల్ లీడ్ పాత్రలు చేస్తుండగా అనికా మెయిన్ లీడ్ చేస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బుట్టబొమ్మ సినిమా జనవరి 26న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అనికా సురేంద్రన్ తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించింది.

Allu Arjun : అల్లు అర్జున్‌కి గోల్డెన్ వీసా.. థ్యాంక్ యు దుబాయ్ అంటూ స్పెషల్ పోస్ట్..

అనికా సురేంద్రన్ మాట్లాడుతూ.. నేను చాలా ఏళ్లుగా బాలనటిగా నటిస్తున్నాను. ఇప్పుడు హీరోయిన్ గా తెలుగులో, పెద్ద బ్యానర్ లో పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. మలయాళంలో కప్పేలా సినిమా చూశాను. సినిమా నచ్చింది. ఆ రీమేక్ సినిమాలో నేను హీరోయిన్ గా నటించడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు సినిమాలో చాలా మార్పులు చేశారు. నాకు తెలుగు రాదు, దీంతో సెట్ లో తెలుగు అర్ధం చేసుకొని నటించడం కొంచెం కష్టంగానే అనిపించింది. అంతే కాకుండా హీరోయిన్ గా మొదటి సినిమా అవడంతో పెద్ద బాధ్యత మోస్తున్నట్టు అనిపించింది. ఈ సినిమా విడుదల కాక ముందే తెలుగులో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. హీరోయిన్ గానే కాక నటిగా కూడా వివిధ పాత్రలు పోషిస్తాను అని తెలిపింది.