రూ.1200కోట్లు వసూల్: దృశ్యం సినిమా చైనాలో రీమేక్

చైనా ఫోన్లూ.. వస్తువులు ఇండియాలో హవా నడిపిస్తుంటే దక్షిణాది సినిమా చైనాలో రీమేక్ అయి రికార్డులు కొల్లగొట్టింది. మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో మళయాళ మాతృకగా వచ్చిన సినిమా.. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ అన్ని భాషల్లోకి రీమేక్ అయి సక్సెస్ సాధించింది. భారత్‌తో పాటు శ్రీలంకలోనూ ధర్మయుద్ధ అనే పేరుతో సినిమా రీమేక్ చేశారు.
ఓ మధ్య తరగతి తండ్రి పడే కష్టాలు.. ఆ తండ్రి కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం చేసుకునే సెల్ఫ్ డిఫెన్స్. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సెంటిమెంట్లు, నేరానికి తగ్గ శిక్షను ఇంటరెస్టింగ్‌గా చూపించడంతో ప్రతి భాషలోనూ గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా ఇండియా న్యాయవ్యవస్థకు అనుగుణంగా రాసుకున్నకథ కాబట్టి ఏ భాషలో తీసినా నడిచిపోయింది.
చైనా రీమేక్ లో మాత్రం క్లైమాక్స్ లో మార్పు చేశాడు డైరక్టర్ శామ్ క్వాహ్. అక్కడి న్యాయవ్యవస్థకు తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించాడు. చైనా భాషలో ఆసినిమా పేరు వూ షా. మోహన్ లాల్ పాత్రను గ్జియో యాంగ్ పోషించారు. షీప్ వితౌట్ షిప్‌యార్డ్ అనే ఇంగ్లీష్ టైటిల్‌తో తెరకెక్కింది. గతేడాది డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా.. Ip Man 4రికార్డులు బద్దలు కొట్టి 168మిలియన్ డాలర్లు(1200కోట్ల రూపాయలు)పైగా వసూలు చేసిందట.