Chiranjeevi : సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ కామెంట్స్..

సంక్రాంతి సినిమాల విడుదలపై హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ వైరల్ కామెంట్స్. దిల్ రాజు‌ని గతంలోనే నేను ప్రశ్నించా..

Chiranjeevi about Sankranthi Movies releases at Hanuman Pre release event

Chiranjeevi : ఈసారి సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’, తేజ సజ్జ ‘హనుమాన్’, వెంకటేష్ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో హనుమాన్ చిత్రం మాత్రమే చిన్న హీరో సినిమా. దీంతో థియేటర్స్ కేటాయింపు దగ్గర ఒక వివాదం నెలకుంది. చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వడం లేదంటూ కామెంట్స్ వినిపించాయి.

తాజాగా ఈ వివాదం గురించి మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ చేశారు. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. “హనుమాన్ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడ్డారు. అయితే థియేటర్ల విషయంలో నిర్మాతలు బాధపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు” అంటూ ధైర్యం చెప్పారు.

Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ మాస్ ట్రైలర్ వచ్చేసింది.. చూడగానే మజా వచ్చిందా..?

“అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకి ఒక పరీక్షాకాలం. ఈ సినిమాని మొదటి రోజు కాకపోతే ఏంటి రెండో రోజు, కుదరకపోతే మూడో రోజు చూస్తారు. కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడు విజయం సాధిస్తుంది” అంటూ పేర్కొన్నారు. ఇక గతంలో ఖైదీ నెం150, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ రిలీజ్ సమయంలో జరిగిన ఓ విషయం గురించి మాట్లాడుతూ.. తాను దిల్ రాజుని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు.

“ఖైదీ నెం150, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ సమయంలో దిల్ రాజు తన నిర్మించిన ‘శతమానంభవతి’ని కూడా రిలీజ్ చేశారు. ఆ సమయంలో నేను దిల్ రాజుని అడిగాను. అటు బాలయ్య, ఇటు నేను ఉన్నాను. ఈ చిత్రాల మధ్య ఈ చిన్న సినిమా అంటే రిస్క్ అవుతుందేమో ఆలోచించండి. శతమానంభవతి రిలీజ్ కొంచెం ఆలస్యం చేయవచ్చు కదా అని దిల్ రాజును అడిగాను. అయితే అది కంటెంట్ ఉన్న సినిమా అని, దానిని ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు చెప్పారు. ఆయన అన్నట్లే ఆ చిత్రం మా సినిమాలతో పాటు విజయం సాదిందించింది. దిల్ రాజుకి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. ఆయనకు ఏ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు. కాబట్టి థియేటర్స్ దొరకలేదని బయపడకండి. మొదటి రోజు కాకపోతే తరువాత అయిన మన సినిమాని చూస్తారు” అంటూ చిరు వ్యాఖ్యానించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు