Guntur Kaaram : ‘గుంటూరు కారం’ మాస్ ట్రైలర్ వచ్చేసింది.. చూడగానే మజా వచ్చిందా..?

మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న ఆ గుంటూరు కారం ట్రైలర్ వచ్చేసింది.

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ మాస్ ట్రైలర్ వచ్చేసింది.. చూడగానే మజా వచ్చిందా..?

Mahesh Babu Sreeleela Guntur Kaaram movie trailer released

Updated On : January 7, 2024 / 9:22 PM IST

Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మాస్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్, మూడు పాటలు మాత్రమే ఆడియన్స్ ముందుకు వచ్చాయి. అయితే అభిమానులంతా ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ముందుగా ప్లాన్ చేశారు.

కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టుపోన్ అవ్వడంతో.. ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేస్తారా లేదా అని అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ ముందుగా చెప్పినట్లు ట్రైలర్ ని ఈరోజే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించిన మూవీ టీం.. తాజాగా ఆ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ముందు నుంచి చెబుతున్నట్లే ఈ సినిమాలో మహేష్ బాబుని ఊర మాస్ రోల్ లో చూడబోతున్నామని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది.

Also read : Hanuman : మూడేళ్ళ క్రిందటే చిరంజీవి.. ‘హనుమాన్’ సినిమా గురించి చెప్పారా.. వీడియో వైరల్

కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నుంచి గుంటూరుకి మార్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 9న మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరగబోతుందని సమాచారం. ఈ ఈవెంట్ గురించిన అప్డేట్ ని మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. కాగా ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.