Hanuman : మూడేళ్ళ క్రిందటే చిరంజీవి.. ‘హనుమాన్’ సినిమా గురించి చెప్పారా.. వీడియో వైరల్

'హనుమాన్' సినిమా గురించి చిరంజీవి మూడేళ్ళ క్రిందటే చెప్పారా..? వైరల్ అవుతున్న పాత వీడియో.

Hanuman : మూడేళ్ళ క్రిందటే చిరంజీవి.. ‘హనుమాన్’ సినిమా గురించి చెప్పారా.. వీడియో వైరల్

Chiranjeevi said about Hanuman movie three years ago

Hanuman : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం ‘హనుమాన్’. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 11 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. మరో ఐదు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చిరంజీవి గెస్ట్ గా నేడు ఘనంగా జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే, చిరంజీవికి సంబంధించిన మూడేళ్ళ క్రిందటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తేజ సజ్జ ఆ వీడియోని షేర్ చేశారు. అది చూసిన కొందరు అభిమానులు.. హనుమాన్ గురించి చిరంజీవి మూడేళ్ళ క్రిందటే హింట్ ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో చిరు ‘హనుమాన్’ సినిమా గురించి మాట్లాడారు. హీరోయిన్ సమంత హోస్టుగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమైన ‘సామ్ జామ్’ షోకి చిరంజీవి అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే.

Also read : Chiranjeevi – Venkatesh : చిరంజీవి హైదరాబాద్‌లో.. వెంకటేష్ వైజాగ్‌లో.. ఇవాళ రాత్రికి..

ఆ షోలో చిరంజీవిని సమంత.. “మీరు ఏ సూపర్ హీరో అవ్వాలని అనుకుంటున్నారు..?” అని ప్రశ్నించగా, చిరు బదులిస్తూ.. ‘హనుమాన్’ అంటూ రిప్లై ఇచ్చారు. 2020 డిసెంబర్ లో చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే ఆరు నెలలు తరువాత ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సూపర్ హీరో సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఈ సినిమా గురించి చిరంజీవికి అప్పుడే తెలుసా..? ఆయనే అప్పుడే ఈ చిత్రం గురించి హింట్ ఇచ్చారా..? అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి కూడా కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవి రూపాని ఉపయోగించారని సమాచారం. దర్శకనిర్మాతలు హనుమంతుడి రూపం పై ఒక సస్పెన్స్ ని మెయిన్‌టైన్ చేస్తున్నారు. మరి ఈరోజు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ సస్పెన్స్ గురించి చిరు ఏమైనా లీక్ చేస్తారేమో చూడాలి.