Pahalgam Terror attack : ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్ర‌ముఖులు.. క్షమించరాని క్రూరమైన చర్య..

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని సినీ ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు.

Chiranjeevi Allu Arjun Jr NTR and others Condemn Pahalgam Terrorist Attack

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగి పోయారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకులను సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 28 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పెను విషాదం పై సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఇది క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బాధితులను చూస్తుంటే తన హృదయం బరువెక్కుతోందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

’28 మంది అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.