తారక్.. ఇదిగో నా వీడియో : ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు, వెంకీ..

‘బి ద రియల్ మేన్’ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి, వెంకటేష్..

తారక్.. ఇదిగో నా వీడియో : ఛాలెంజ్ పూర్తి చేసిన చిరు, వెంకీ..

Updated On : June 21, 2021 / 2:44 PM IST

‘బి ద రియల్ మేన్’ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి, వెంకటేష్..

మెగాస్టార్ చిరంజీవి ‘బి ది రియల్ మేన్’ ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌‌లో భాగంగా చిరు ఇంటిని శుభ్రం చేయడంతో పాటు వంట కూడా చేశారు. అందరూ భార్యకు సహాయం చేస్తే.. మెగాస్టార్ మాత్రం తన తల్లి కోసం దోశెలు వేశారు. పక్కన కూర్చుని తినిపించారు.
ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘భీమ్ (తారక్) .. ఇదిగో నా వీడియో. నేను రోజూ చేసే పనులే.. ఇవ్వాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం’ అని పేర్కొన్నారు. ఇక ఈ ఛాలెంజ్ కోసం తన తరఫున తన స్నేహితుడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌ తో‌పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కూడా  నామినేట్ చేశారు చిరు.

 

‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ఎన్టీఆర్ ద్వారా విక్టరీ వెంకటేష్‌కు చేరగా, నేడు ఆయన తన ఇంటిని శుభ్రం చేస్తూ, లాన్‌లో గడ్డిని, మొక్కలను కట్ చేస్తూ, అలానే వంట చేస్తూ సక్సెస్ఫుల్‌గా పూర్తి చేసారు. తారక్ నా ఛాలెంజ్‌ని పూర్తి చేశాను అంటూ తన వీడియోని పోస్ట్ చేసిన వెంకటేష్, తదుపరి ఆ ఛాలెంజ్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి లకు విసిరారు.