Chiranjeevi-Anil Ravipudi : మెగా 157 నుంచి సూపర్​ అప్​డేట్..

చిరంజీవి సినిమాని జెట్‌ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.

Chiranjeevi-Anil Ravipudi : మెగా 157 నుంచి సూపర్​ అప్​డేట్..

Chiranjeevi Anil Ravipudi movie update

Updated On : June 13, 2025 / 10:52 AM IST

చిరంజీవి సినిమాని జెట్‌ స్పీడ్‌లో పరుగులు పెట్టిస్తున్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఆల్రెడీ ఫస్ట్‌ షెడ్యూల్‌ సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేసుకున్న ఈ మెగా ఎంటర్‌టైనర్‌.. నెక్స్ట్‌ షెడ్యూల్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్‌ కామెడీ స్పెషలిస్ట్‌ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్‌కి చేరాయి. విక్టరీ వెంకటేశ్‌కి సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల కలెక్షన్స్‌ సినిమా అందించిన అనిల్.. మెగాస్టార్‌తో చేయబోయే ఈ సినిమాతో బాక్సాఫీస్‌ని రఫాడించడం పక్కా అని ఫిక్స్‌ అయ్యారు ఆడియెన్స్. సంక్రాంతికి రిలీజ్ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్న ఈ సినిమాని సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేస్తున్నారు డైరెక్టర్‌ అనిల్‌.

లేటెస్ట్‌గా ముస్సోరిలో స్టార్ట్‌ అయిన సెకండ్‌ షెడ్యూల్‌కి సంబంధించిన చిరంజీవి వీడియో రిలీజ్‌ చేసి.. క్రేజీ ప్రమోషన్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు అనిల్.

పక్కా కమర్షియల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మెగా157 ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. సెకండ్‌ షెడ్యూల్‌ కోసం డెహ్రాడూన్‌కి షిఫ్ట్‌ అయిన మూవీ యూనిట్‌.. ముస్సోరిలోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేస్తోంది. దీనికి సంబంధించి రిలీజ్‌ చేసిన చిరంజీవి వీడియోని సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ సెకండ్‌ షెడ్యూల్‌లోనే చిరు నయనతారపై సాంగ్‌ని కూడా డైరెక్ట్‌ చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఇందుకు కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ స్పెషల్‌ బీట్స్‌ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మెగా157 ప్రాజెక్ట్‌ని పక్కా షెడ్యూల్స్‌తో సూపర్‌ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేస్తోన్న డైరెక్టర్‌ అనిల్‌ వర్కింగ్‌ స్టయిల్‌కి ఫిదా అయ్యారు చిరంజీవి. తన మార్క్‌ కామెడీ డైలాగ్స్‌.. అండ్‌ హిలేరియస్‌గా కంటెంట్‌తో సీన్స్‌ తెరకెక్కిస్తున్నారని.. చిరంజీవి అనిల్‌కి కితాబ్‌ ఇవ్వడంతో.. సినిమాపై ఎగ్జైట్‌మెంట్ పెరిగిపోతుంది. విక్టరీ వెంకటేశ్‌ గెస్ట్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కేథరిన్‌ ట్రెస్సా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి చిరు సినిమాని జెట్‌ స్పీడ్‌లో పరుగులు పెట్టించడమే కాదు.. ప్రమోషన్స్‌తోనూ అదరగొడుతు.. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచేస్తున్నారు డైరెక్టర్‌ అనిల్.