Manchu Vishnu: చిరంజీవి పోటీ నుంచి తప్పుకోమన్నారు.. నాగబాబుని కలుస్తా -మంచు విష్ణు
తనకు ఓటు వేసి గెలిపించినందుకు 'మా' సభ్యులు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు మంచు విష్ణు.

Manchu Vishnu
Manchu Vishnu: తనకు ఓటు వేసి గెలిపించినందుకు ‘మా’ సభ్యులు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని తెలిపారు మంచు విష్ణు. ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి సినిమావారి సమస్యలు తీర్చేందుకు పనిచేస్తానని అన్నారు. మా ప్యానెల్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని, అవతలి ప్యానెల్ వారు కూడా మా సభ్యులేనని, నాగబాబు మా కుటుంబ సభ్యులే.. ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చెయ్యను అని అన్నారు మంచు విష్ణు.
త్వరలోనే నాగబాబు గారిని కలుస్తానని, జరిగింది జరిగిపోయింది.. జరగాల్సింది చెయ్యాలని కోరుతానని అన్నారు. ప్రకాష్ రాజ్ రాజీనామాను కూడా నేను అంగీకరించను.. ప్రకాష్ రాజ్ సలహాలు సూచనలు కావాలని అన్నారు. రెండు, మూడు రోజుల్లో నేను ప్రకాష్ రాజ్‌ని కలుస్తానని అన్నారు. శ్రీలంక, అప్ఘానిస్తాన్ నుంచి కూడా నటులు తెలుగుకి రావాలన్నారు.
260 మంది సభ్యులు ప్రకాష్ రాజ్‌ని కోరుకున్నారని, ఆయన సేవలు ”మా”కు కావాలని అన్నారు. రామ్‌చరణ్ కూడా నాకు మంచి మిత్రుడని, చరణ్ ఓటు ప్రకాష్ రాజ్‌కే వేసి ఉండొచ్చు. చరణ్ వాళ్ల నాన్న చిరంజీవి మాటను జవదాటడు కాబట్టి అలా వేసి ఉండొచ్చు. నన్ను పోటీలో నుంచి తప్పుకోమని చిరంజీవి గారే స్వయంగా చెప్పారని అన్నారు విష్ణు.