Chiranjeevi : డ్యాన్స్‌లో తనకు తానే పోటీ.. ఆయనకెవరూ రారు సాటి..

డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే..

Chiranjeevi : డ్యాన్స్‌లో తనకు తానే పోటీ.. ఆయనకెవరూ రారు సాటి..

Chiranjeevi Dance

Updated On : August 21, 2021 / 7:31 PM IST

Chiranjeevi: ఆయనలా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంటే స్వయంగా నటరాజు స్వామే నడుస్తున్నట్టు ఉంటుంది. కాలు కదిపితే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.. డ్యాన్స్ అంటే మెగాస్టార్ చిరంజీవి.. చిరు అంటే డ్యాన్స్.. అన్నంతగా తెలుగు సినిమా చరిత్రలో తన డ్యాన్సింగ్ స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేశారాయన.

Chiranjeevi

డ్యాన్స్‌లో చిరంజీవి ఈజ్, గ్రేస్, ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.. ఇన్నేళ్ల సినీ జర్నీలో ఎన్నో సూపర్ హిట్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్స్ చిరు ఖాతాలో ఉన్నాయి. ‘ఛాలెంజ్’, ‘హీరో’,‘ దొంగ’, ‘జ్వాల’, ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘రాక్షసుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన డ్యాన్స్ చేశారాయన.

Chiru

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. బంతీ చామంతీ.. యురేకా.. గువ్వా గోరింకతో.. అబ్బ నీ తియ్యని దెబ్బా.. కాశ్మీరు లోయలో.. శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో.. బంగారు కోడి పెట్ట.. అత్తో అత్తమ్మ కూతురో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో డ్యాన్సింగ్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మెగాస్టార్ అకౌంట్‌లో.

Mutamestri

కొరియోగ్రాఫర్స్ చిరుకి మూమెంట్స్ కంపోజ్ చెయ్యడానికి పోటీ పడుతుండేవారు. ఆయనతో ఒక్క సాంగ్ అయినా కలిసి పని చెయ్యాలని ఆరాటపడేవారు. చిరుని ఇండియన్ మైఖేల్ జాక్సన్, డ్యాన్సింగ్ స్టార్, బాస్ ఆఫ్ బ్రేక్ డ్యాన్స్ అని పిలిచేవారు. సంగీత దర్శకులు కూడా చిరంజీవి సినిమాలకు పాటలు కొట్టడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. డ్యాన్స్ నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఫస్ట్ ఆప్షన్ మెగాస్టార్ చిరంజీవి పాటలే.

Chiru Dance

‘పసివాడి ప్రాణం’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేసిన ఘనత చిరుదే. కొండవీటి దొంగ, కొదమ సింహం, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రిక్షావోడు లాంటి సినిమాల్లో ఆయన డ్యాన్స్ ఎవర్ గ్రీన్ అసలు. దాయి దాయి దామ్మా అంటూ మెగాస్టార్ వేసిన వీణ స్టెప్ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో తెలిసిందే. మన్మథా మన్మథా మామ పుత్రుడా పాటలో ఆయన స్టెప్స్ అదుర్స్ అంతే.

Indra

సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టైంలో తనయుడు రామ్ చరణ్ ‘మగధీర’ లో బంగారు కోడి పెట్ట రీమీక్స్ పాటలో కాలు కదిపి అదరగొట్టేశారు. ఇక రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 లో అన్ని పాటల్లోనూ అరిపించేశారు. ముఖ్యంగా రత్తాలు రత్తాలు, అమ్మడు లెట్స్ కుమ్ముడు, సుందరి పాటల్లో.. డ్యాన్స్‌లో ఎప్పటికీ తనకు తానే పోటీ.. తనకెవరూ రారు సాటి.. అని నిరూపించారు.

Lahe Lahe