Bholaa Shankar : ‘ఆర్ఆర్ఆర్’ రోజునే ‘భోళా శంకర్’!

మెగస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తున్న ‘భోళా శంకర్’ నవంబర్ 11న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది..

Bholaa Shankar : ‘ఆర్ఆర్ఆర్’ రోజునే ‘భోళా శంకర్’!

Bholaa Shankar

Updated On : October 27, 2021 / 3:34 PM IST

Bholaa Shankar: మెగస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర ఓ క్రేజీ ఫిలిం ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమిళ్‌లో ‘తల’ అజిత్ నటించగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘వేదాళం’ సినిమాను తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..

చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు ‘భోళా శంకర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే రాఖీ పౌర్ణమి కూడా ఆగస్టు 22నే కావడంతో ‘రాఖీ విత్ భోళా శంకర్’ పేరుతో ఓ బ్యూటిఫుల్ వీడియో రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే

చిరు ఇమేజ్‌ అండ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు దర్శకుడు పక్కాగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావడంతో ఓపెనింగ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 11న ‘భోళా శంకర్’ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.

Prabhas : ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటాన్రా?..

2018 నవంబర్ 11న జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ 2018 నవంబర్ 11న షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడదే డేట్‌కి మెగాస్టార్ సినిమా పూజతో ప్రారంభంకానుంది. 2022 సమ్మర్‌లో ‘భోళా శంకర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చిరు, చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న రిలీజ్ అవబోతోంది.