Chiranjeevi : మంత్రి కేటీఆర్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్!

తెలంగాణ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టినరోజు నేడు కావడంతో.. రాజకీయ, సినీ రంగం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే..

Chiranjeevi : మంత్రి కేటీఆర్‌కి చిరంజీవి బర్త్ డే విషెస్.. ట్వీట్ వైరల్!

Chiranjeevi birthday wishes to minister KTR tweet gone viral

Updated On : July 24, 2023 / 12:00 PM IST

KTR – Chiranjeevi : తెలంగాణ పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (kalvakuntla taraka rama rao) అలియాస్ కేటీఆర్.. తన విజన్ తో తెలంగాణని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నేడు దేశంలోనే హైదరాబాద్ (Hyderabad) ని ప్రముఖ ఐటీ హబ్ (IT Hub) గా నిలబెడుతున్నారు. ఇక డైనమిక్ లీడర్ పుట్టినరోజు నేడు కావడంతో.. రాజకీయ, సినీ రంగం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

Gandeevadhari Arjuna Teaser : గాండీవధారి అర్జున టీజర్‌ రిలీజ్.. హాలీవుడ్ రేంజ్‌లో వరుణ్ తేజ్ స్టంట్స్..

“మై డియర్ బ్రదర్ తారక్.. నువ్వు ఒక డైనమిక్ లీడర్ మాత్రమే కాదు, గొప్ప స్నేహితుడివి కూడా. మేమందరం నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటాం, అలాగే నీ నుంచి మేము స్ఫూర్తి పొందుతుంటాం. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Oppenheimer vs Barbie : ‘ఓపెన్‌హైమర్’ కాదు ‘బార్బీ’కే నా ఓటు అంటున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్..

ఇక చిరంజీవి సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం భోళా శంకర్ (Bholaa Shankar) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. గ్యాంగ్ స్టార్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుంటే, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ని ఈ నెల 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.