Chiranjeevi comments about Anand Deverakonda Vaishnavi Chaitanya Baby Movie
Chiranjeevi – Baby : సాయి రాజేష్ దర్శకత్వంలో SKN నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘బేబీ’. జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అని అందుకొని బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ మూవీ సెలబ్రిటీస్ కూడా నచ్చడంతో స్పెషల్ ఈవెంట్లు పెట్టి మరి అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్న అల్లు అర్జున్, తాజాగా చిరంజీవి.. బేబీ మెగా ఈవెంట్ నిర్వహించి చిత్ర యూనిట్ అభినందించారు.
చిరంజీవి మాట్లాడుతూ..
బేబీ మూవీ ఇప్పటి యువతకి మాత్రమే కాదు, ఇప్పటి పేరెంట్స్ కి కూడా ఒక మెసేజ్ లాంటింది. ఈ జనరేషన్ యువత ఫోన్ బాగా ఆకర్షితులు అయ్యి, సోషల్ మీడియా ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో అనేక సమస్యల్లో పడుతున్నారు. ఒక బలహీనమైన క్షణంలో తెలిసో, తెలియకో చిన్న వయసులోనే తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో తెలియక బయపడి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యూత్ ధైర్యంగా ఆ సమస్యని ఎదురుకోవాలంటే పేరెంట్స్ హెల్ప్ కూడా కావాలి.
Samajavaragamana : థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ సరికొత్త రికార్డును సృష్టించిన సామజవరగమన
చిన్న వయసులో ఉన్న పిల్లలు చిన్న తప్పుని కూడా హ్యాండిల్ చేయలేరు. ఆ తప్పు ఎక్కడ పేరెంట్స్ కి తెలిస్తే తిడతారో అనే భయం కలిగి.. సమస్యని తమలోని ఉంచుకొని ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. అలా కాకుండా ప్రతి పేరెంట్.. తమ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ, వారి ప్రతి విషయాలను తెలుసుకుంటూ, వచ్చే సమస్యలు గురించి ముందుగానే పిల్లలకి స్నేహ భావంగా చెబుతూ ఉండడంతో.. పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఇదొక ఎడ్యుకేటెడ్ మూవీ.