Chiranjeevi : ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది : చిరంజీవి
పవన్ ప్రసంగానికి ఫిదా అయినట్లు చిరంజీవి తెలిపారు.

Chiranjeevi comments pawan kalyan speech at janasena formationday event
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించింది. కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో నిర్వహించిన వేడుకల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
కాగా.. పవన్ స్పీచ్‌ను మెగా చిరంజీవి ప్రశంసించారు. ‘మైడియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ సోషల్ మీడియాలో చిరు రాసుకొచ్చారు.
Jack : జాక్ మూవీ నుంచి కిస్ సాంగ్ ప్రొమో..
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025
12వ ఆవిర్భావ వేడుకల్లో పవన్ మాట్లాడుతూ.. అన్నీ ఒక్కడినై తాను పోరాటం చేశానన్నారు. తాను ఓడిపోయినప్పటికీ అడుగులు ముందుకే వేశానని చెప్పారు. తాము నిలబడి, పార్టీని నిలబెట్టామన్నారు. అంతేగాక, నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామన్నారు. తమ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ వెనకడుగు వేయలేదన్నారు.
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం.. యూకే పార్లమెంట్‌లో..
11 సంవత్సరాల జనసేన ప్రస్థానాన్ని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని ఎలా నిలబెట్టింది వంటి వాటిని వివరించారు పవన్. ఇక తాను చిన్నప్పుడు ఎంతో గారాబంగా పెరినట్లు తెలిపారు. సినిమాల్లోకి, రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదన్నారు. ఇదంతా భగవంతుడి దయేనన్నారు. తనను ఆదరిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపారు.