Chiranjeevi : 25 రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతూ మెగాస్టార్.. దగ్గరుండి స్టేజిపైకి ఎక్కించిన తేజ్.. అయినా యాక్టివ్‌గా..

చిరంజీవి స్టేజిపైకి వెళ్ళేటప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ చిరు చేయిని పట్టుకొని మరీ స్టేజి మీదకు నడిపించాడు.

Chiranjeevi Effected with Health Disease from Past 25 Days Sai Dharam Tej Helped to Megastar on Event

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి నేడు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డు అందించారు. ఈ అవార్డును నేడు చిరంజీవికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ అంద‌జేశారు. మెగాస్టార్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాన్స్ మాత్రమే. అలాంటి డాన్స్ మీదే చిరంజీవి ఈ రికార్డ్ అందుకున్నారు. 156 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందచేశారు.

ఈ ఈవెంట్ నేడు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతూనే వచ్చారు. ఈవెంట్ హోస్ట్ చేసిన యాంకర్ చిరంజీవిని పైకి పిలుస్తూ.. గత 25 రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతూనే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి వచ్చారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభిమానుల కోసం మన ముందుకు వచ్చారు అని తెలిపింది.

Also Read : Megastar Chiranjeevi : మెగాస్టార్‌కి అరుదైన గౌర‌వం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో చిరంజీవి పేరు..

చిరంజీవి స్టేజిపైకి వెళ్ళేటప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ చిరు చేయిని పట్టుకొని మరీ స్టేజి మీదకు నడిపించాడు. అలాగే మరో పక్కన అమీర్ ఖాన్ కూడా చిరుని సపోర్ట్ గా పట్టుకున్నారు. దీంతో చిరంజీవి నీరసంగా ఉన్నా ఈవెంట్ కి వచ్చి, ఫ్యాన్స్ కోసం యాక్టివ్ గా ఉంటూ ఈవెంట్ అంతా పాల్గొన్నారు అని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి మెగాస్టార్ ని అభినందిస్తున్నారు.