Ram Charan : తండ్రిగా ఎంతో గర్వంగా ఉంది.. పుత్రోత్సాత్వంతో చిరంజీవి ట్వీట్..

రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడంతో చిరంజీవి పుత్రోత్సాత్వంతో ఎమోషనల్ ట్వీట్ చేసారు.

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం నుంచి తండ్రికి మించిన తనయుడు అనిపించుకునే స్థాయి వరకు చేరుకున్నారు. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఇమేజ్ ని పెంచుకుంటూ వెళ్లిన రామ్ చరణ్.. ప్రేక్షకుల చేత గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నారు. కాగా రీసెంట్ గా రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు.

తాజాగా రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా రామ్ చరణ్ ఈ గౌరవ పట్టా అందుకున్నారు. ఇక దీని పై చిరంజీవి స్పందిస్తూ పుత్రోత్సాత్వంతో ట్వీట్ చేసారు.

Also read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్..

“ప్రఖ్యాత విద్యాసంస్థ వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్ కి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయడం.. ఒక తండ్రిగా నన్ను ఎమోషనల్ గా మరియు గర్వించేలా చేస్తుంది. ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం. పిల్లలు తల్లిదండ్రుల విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో తన కెరీర్ లో ముందుకు అడుగు వేస్తూ.. పైకి ఎదుగుతున్నాడు. లవ్ యూ మై డియర్ డా.రామ్ చరణ్” అంటూ ట్వీట్ చేసారు.

నాగబాబు కూడా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ వేశారు. “చిన్న వయసులోనే రామ్ చరణ్ ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తూ మరియు ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను. చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ వేశారు. అలాగే ఉపాసన, సాయి దుర్గ తేజ్ కూడా చరణ్ కి విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేసారు.

ట్రెండింగ్ వార్తలు