Chiranjeevi : భోళాశంకర్ సెట్‌లో చంద్రబోస్‌కి చిరు సత్కారం..

ఆస్కార్‌తో (Oscar) భోళాశంకర్ (Bhola Shankar) సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన చంద్రబోస్ ని (Chandrabose) చిరంజీవి సత్కరించాడు.

Chiranjeevi felicitate oscar winner Chandrabose at Bhola Shankar sets

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రతిభ ఉన్న వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తుంటాడు. చిన్న ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా.. వాళ్ళ పనిలో ప్రతిభ కనబడితే పిలిచి మరి అభినందిస్తాడు. ఇక తాజాగా RRR చిత్ర యూనిట్ నాటు నాటు (Naatu Naatu) పాటతో ఆస్కార్ ని (Oscar) గెలిచి.. ఇండియాకి మొట్టమొదటి ఆస్కార్ ని తీసుకు వచ్చారు. దీంతో మూవీ టీంకి ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నాటు నాటు పాట రాసి ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ ని (Chandrabose) చిరంజీవి సత్కరించాడు.

Chiranjeevi : RRR టీంకి చిరు ఘన సన్మానం..

ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సెట్ లోకి చంద్రబోస్ ఆస్కార్ తో అడుగు పెట్టాడు. చిత్ర యూనిట్ సమక్షంలో చిరంజీవి, చంద్రబోస్ కి శాలువా కప్పి చిరు సత్కారం చేశాడు. చంద్రబోస్ తన ఆస్కార్ ని చిరు చేతులకు అందించగా, దానిని పట్టుకొని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. తెలుగు భాషకి ఆస్కార్ తెచ్చినందుకు చంద్రబోస్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో రాజమౌళి, కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కార్తికేయ లను కూడా చిరు శాలువాతో సత్కరించారు.

Chiranjeevi : అల్లు అర్జున్ 20 ఇయర్స్ జర్నీ.. చిరు ఎమోషనల్ పోస్ట్!

ఇక భోళాశంకర్ విషయానికి వస్తే.. ఈ సినిమా తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లిగా కనిపించబోతుంది. అక్కినేని హీరో సుశాంత్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 11న విడుదల కాబోతుంది.