Site icon 10TV Telugu

Chiranjeevi : రాజకీయాలకు దూరంగా ఉన్నా నాపై విమర్శలు.. నా ఫ్యాన్స్ వల్ల ఆ బిడ్డ బతికాడు.. చిరంజీవి కామెంట్స్ వైరల్..

Chiranjeevi Interesting Comments in Mega Blood Donation Camp

Chiranjeevi

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో రక్తదానాలకు పిలుపు ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పిలుపు మేరకు లక్షల మంది అభిమానులు రక్తదానం చేస్తూనే ఉన్నారు. నేడు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని నిర్వహించగా చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఇక్కడ సాయంత్రం వరకు రక్తదానం చేస్తున్న వెయ్యి మందికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కొత్త జనరేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా రక్తదానం గురించి. ఒక జర్నలిస్ట్ రాసిన ఒక ఆర్టికల్ నన్ను రక్తదానం వైపు ప్రయాణం చేసేలా చేసింది. 25 ఏళ్ళ క్రితం బ్లడ్ దొరక్క చాలామంది చనిపోతున్నారు అని తెలిసి బ్లడ్ ఇవ్వరా? దొరకలేదా? అని అనిపించి ఫ్యాన్స్ ని చైతన్యం చేసి బ్లడ్ డొనేషన్ వైపు మళ్లిస్తే ఎంతోమందికి ఉపయోగపడతారు, వాళ్ళ మీద కూడా అందరికి మంచి అభిప్రాయం వస్తుంది అనుకున్నాను. దాని వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడతాయి.

Also Read : Raja Saab : ‘రాజాసాబ్’ పార్ట్ 2 కూడా ఉంది.. సినిమా వాయిదా.. లెంగ్త్ ఎంతంటే.. ప్రభాస్ సినిమా గురించి నిర్మాత కామెంట్స్..

అప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఇవాళ్టికి లక్షల మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. రక్తదానం అనగానే చిరంజీవి పేరు గుర్తొస్తుంది అంటే ఆది నా జన్మ అదృష్టం. నేను పాలిటిక్స్ కి దూరంగా ఉన్నా ఒక పొలిటీషియన్ నా మీద అకారణంగా కొన్ని అవాకులు చెవాకులు పేలారు. తర్వాత ఆయన ఒక ముంపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ తనని పట్టుకొని చిరంజీవిని అనడానికి నీకెలా మనసొచ్చింది అని తిట్టింది. ఆ వీడియో నా దగ్గరకు వచ్చింది. ఆమె అలా ఎందుకు చేసింది, నా అభిమానా, ఆమె ఎవరు? ఆమె గురించి తెలుసుకోవాలని అనుకున్నాను.

ఆమె గురించి కనుక్కుంటే ఆమె నా అభిమానిని కాదు. ఆమె చెప్పిందేంటంటే.. నా ఎనిమిదేళ్ల బిడ్డకు డెంగ్యూ వచ్చి ప్లేట్ లెట్స్ లేక చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు, రక్తం దొరక్క బాధలో ఉన్నప్పుడు ఎవరో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి ఫోన్ చేయమంటే చేశాను. గంటలో నా కొడుక్కి రాజమండ్రి లో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ ని పంపి బ్లడ్ ఇచ్చి, దాంట్లోంచి ప్లేట్ లెట్స్ వేరు చేసి నా బిడ్డకు ప్లేట్ లెట్స్ ఎక్కించి బతికించారు. అలాంటి గొప్పయాన్ని ఇలాంటి నీచులు అలా అంటారా అని చెప్పింది. తర్వాత ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ మాట్లాడలేదు. చాలా మంది నన్ను అడుగుతారు. మిమ్మల్ని ఇలా తిడతారు, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు మీరేమి మాట్లాడారా అని. నాకు నేను చేసే మంచి కార్యక్రమాలు, నా ఫ్యాన్స్, వాళ్ళ ప్రేమ రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లేదు. నేను దేనికి స్పందించను. మంచి చేసుకుంటూ వెళ్ళిపోతాను అని అన్నారు. దీంతో మెగాస్టార్ కామెంట్స్ వైరల్ అవ్వగా ఆ రాజకీయ నాయకుడు ఎవరా అనేది చర్చగా మారింది.

Also Read : Bellamkonda Srinivas : హైదరాబాద్ లో ఫస్ట్ టైం.. నేను, ఎన్టీఆర్ గారు కలిసి.. ఎన్ని తిన్నామో కూడా గుర్తు లేదు..

Exit mobile version