Bellamkonda Srinivas : హైదరాబాద్ లో ఫస్ట్ టైం.. నేను, ఎన్టీఆర్ గారు కలిసి.. ఎన్ని తిన్నామో కూడా గుర్తు లేదు..
ఇటీవల శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.

Bellamkonda Srinivas
Bellamkonda Srinivas : నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎన్టీఆర్ తో ఆది, రభస సినిమాలు చేసారు. దీంతో ఎన్టీఆర్ తో ఆ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఏర్పడింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఎన్టీఆర్ కి క్లోజ్ గా ఉంటాడు. ఇటీవల శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.
శ్రీనివాస్ మాట్లాడుతూ.. అప్పుడు హైదరాబాద్ లో ప్రసాద్స్ మల్టిప్లెక్స్ థియేటర్ వద్ద ఫస్ట్ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ వచ్చింది. అప్పుడు ఆది షూటింగ్ జరుగుతుంది. మధ్యలో నేను, ఎన్టీఆర్ గారు వెళ్లి బర్గర్స్ తిన్నాం. ఎన్ని బర్గర్స్ తిన్నామంటే గుర్తు కూడా లేదు అన్ని బర్గర్స్ తిన్నాం. ఆయన అంత ఫుడ్ లవర్. కానీ ఇప్పుడు చాలా ఫిట్ గా ఉన్నారు అంత డెడికేషన్ తో అని తెలిపాడు.
Also Read : Srikanth : నా ముందే నన్ను హీరోగా వద్దన్నారు.. చుట్టాలు అని ఖడ్గం సినిమాలో ఆ హీరోని తీసుకుంటాం అన్నారు..
దీనిపై పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఆది సినిమా వచ్చింది 2002లో, హైదరాబాద్ కి ఫస్ట్ మెక్ డొనాల్డ్స్ వచ్చింది 2006లో. దీంతో 2006 లో మెక్ డొనాల్డ్స్ వస్తే ఆది షూటింగ్ అని ఎలా చెప్తావు అని ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీనివాస్ ఎన్టీఆర్ తో వెళ్లి తిన్నది నిజమే కావొచ్చు కానీ అది వేరే సినిమా షూటింగ్ అయి ఉంటది మర్చిపోయి ఆది చెప్పాడేమో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.