Srikanth : నా ముందే నన్ను హీరోగా వద్దన్నారు.. చుట్టాలు అని ఖడ్గం సినిమాలో ఆ హీరోని తీసుకుంటాం అన్నారు..

ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ ప్లేస్ లో వేరే హీరోని అనుకున్నారట.

Srikanth : నా ముందే నన్ను హీరోగా వద్దన్నారు.. చుట్టాలు అని ఖడ్గం సినిమాలో ఆ హీరోని తీసుకుంటాం అన్నారు..

Srikanth

Updated On : August 6, 2025 / 9:04 AM IST

Srikanth : కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా ఎంత గొప్ప సినిమానో అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ దేశభక్తి సినిమా అని చెప్పొచ్చు. ఇప్పటికి ఆ సినిమాని, సాంగ్స్ ని ఎన్ని సార్లు చూసినా, విన్నా బోరు కొట్టదు. ఒక్క సినిమాలో దేశభక్తి, సినిమా, లవ్ స్టోరీ.. ఇలా అన్ని అంశాలు చూపించారు. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్స్ లో అదరగొట్టారు.

అయితే శ్రీకాంత్ ప్లేస్ లో వేరే హీరోని అనుకున్నారట. శ్రీకాంత్ ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Also Read : Chammak Chandra : వాళ్ళు ఆర్టిసులు అయిపోయి నేను అవ్వలేదు.. అప్పుడే లైఫ్ & డెత్ అనుకున్నా.. చమ్మక్ చంద్ర ఎమోషనల్..

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఖడ్గం సినిమాలో నిర్మాతలు నన్ను వద్దన్నారు. నేను హీరోగా వద్దు అని నా ముందే కృష్ణవంశీ కి చెప్పారు. జగపతి బాబుని పెడతా, కావాలంటే బడ్జెట్ ఎక్కువ పెడతా అన్నారు. జగపతి బాబు వాళ్లకు చుట్టాలు అందుకే. కానీ కృష్ణవంశీ నాకు శ్రీకాంత్ కావాలి, నువ్ చేస్తే చెయ్యి లేకపోతే ఇంకో నిర్మాత చూసుకుంటా అన్నాడు. అప్పుడు నిర్మాత మధు శ్రీకాంత్ ఫ్యామిలీ హీరో మాస్ ఎలా చేస్తాడు అని అడిగాడు. కృష్ణవంశీ నాకు శ్రీకాంత్ కావాలి, అతను మాస్ చేస్తాడు బాగా, నాకు నమ్మకం ఉంది, నేను చేయిస్తాను అని చెప్పాడు. కృష్ణవంశీ గట్టిగా నా కోసం నిలబడ్డాడు. అందుకే నాకు అతను కొంచెం స్పెషల్ ఎఫెక్షన్ అని తెలిపాడు.

ఖడ్గం నిర్మాత మధు మురళి జగపతిబాబుకి చుట్టాలు అవుతారు. జగపతి బాబుతో మధు ఏకంగా అరడజను సినిమాలు నిర్మించాడు. అవన్నీ మంచి సినిమాలుగానే నిలిచాయి.

Also Read : Anchor Ravi : నేను సారీ చెప్పను, చెప్పలేదు.. 1300 మెసేజ్‌లు బూతులు తిడుతూ.. నేను, సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్..