Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి.. ట్వీట్‌తో హింట్..

అమితాబ్ బచ్చన్ హిందీలో 'కౌన్ బనేగా క్రోర్‌పతి' (KBC) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో చిరంజీవి పాల్గొనబోతున్నాడట.

Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి.. ట్వీట్‌తో హింట్..

Chiranjeevi is in Amitabh Bachchan Kaun Banega Crorepati show

Updated On : October 11, 2023 / 4:08 PM IST

Chiranjeevi – Amitabh Bachchan : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది పెద్ద పండగా అనే చెప్పాలి. చివరిగా ఇద్దరు కలిసి ‘సైరా’ సినిమాలో కనిపించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారట. నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కూడా తెలియజేశాడు. అయితే ఈ శుభాకాంక్షలుతో పాటు మరో న్యూస్ ని కూడా చెప్పాడు.

Also read :  నాగచైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? వైరల్ అవుతున్న పిక్స్..!

అమితాబ్ బచ్చన్ హిందీలో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ (KBC) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో చిరంజీవి పాల్గొనబోతున్నాడట. చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నేను నా ఇన్‌స్పిరేషన్ అయిన అమితాబ్ ని KBC షోలో ఈ రోజు నైట్ వర్చ్యువల్ గా కలుసుకోబోతున్నాను” అంటూ తెలియజేశారు. కాగా చిరంజీవి కూడా తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోకి కూడా తెలుగులో మంచి ప్రేక్షాధారణ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హోస్ట్ లు కలిసి ఈ షోలో కనిపించబోతున్నారు అని తెలియడంతో.. ఈ షోలో ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో అమితాబ్ ‘అశ్వద్ధామ’ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)