Chiranjeevi launch Brahmanandam autobiography book Nenu
Chiranjeevi – Brahmanandam : చిరంజీవి, బ్రహ్మానందం ఆత్మీయత గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రహ్మిని ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చిందే చిరు. దీంతో బ్రహ్మికి చిరు అంటే ఎంతో అభిమానం. కెరీర్ లో వెయ్యకు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు సృష్టించిన బ్రహ్మానందం.. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఏదో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు.
ఇక ఇంటి దగ్గరే ఉంటున్న బ్రహ్మి.. ఫ్యామిలీతో గడపడం, బొమ్మలు వేయడం, తయారు చేయడం వంటివి చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే తాజాగా ఒక బుక్ ని కూడా రాశారు. జీవితంలో ఆయన కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, తనకెదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి ఒక ఆత్మకథగా ‘నేను’
అనే పుస్తకరూపంలో.. తన జీవితాన్ని అందరి ముందుకు తీసుకు వస్తున్నారు.
Also read : Jani Master : నేను వైఎస్ జగన్ అభిమానిని.. పవన్ వీరాభిమాని జానీ మాస్టర్ కామెంట్స్..
ఆ బుక్ కవర్ పేజీలోనే బ్రహ్మి ఇలా చెప్పుకొచ్చారు.. ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావొచ్చు, మార్గదర్శకం కావొచ్చు అని పేర్కొన్నారు. ఇక ఈ బుక్ ని తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ బుక్ ని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఆ బుక్ అమెజాన్ లింక్ ని చిరంజీవి షేర్ చేశారు.
నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా
తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో
తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన
ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/O6M8dEFqBZ— Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023
మరి స్క్రీన్ మీద చూసిన బ్రహ్మి.. ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉండేవారు తెలుసుకోవాలంటే ఆ బుక్ కొనుగోలు చేసుకొని చదివేయండి. ఇక ఆత్మకథ బుక్ వార్తని చూసిన ఆడియన్స్.. జులాయి సినిమాలో బ్రహ్మి చేసిన కామెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. జులాయి మూవీలో జైలు సీన్ లో బ్రహ్మానందం.. “నాకు ఒక ఆత్మ ఉంది. దానికి ఓ కథ ఏడ్చింది. కాగితాలు, పెన్నులు ఇస్తే రాసుకుంటా” అని చెప్పిన డైలాగ్ ని కామెంట్స్ చేస్తున్నారు.