Chiranjeevi may sing a song for Chiru Anil movie
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగనాడు మెగాస్టార్ చిరంజీవి నవ్వుల పండగను తెచ్చేపనిలో ఉన్నారు. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం పేరుతో వెంకటేష్ తో చేసిన సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. అయితే అలాంటి హిట్ నే 2026లో వెండితెరపై నవ్వులు పూయించబోతున్నారు అనిల్ రావిపూడి. మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సంక్రాంతికి రఫ్ ఆడిద్దామంటూ వస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.
అయితే ఈ సినిమాలో చిరు పాత్ర ఏవిధంగా ఉండబోతుంది? చిరు ఎన్ని రోల్స్ చేయబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్సే అంటున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఉగాది రోజున గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమా టీమ్ ఆ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ వీడియోను ఆడియన్స్ కు చూపించారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ తో బేసికలీ..ప్రాక్టికలీ,,టెక్నీకలీ అంటు ఓ సాంగ్ పాడించాడు అనిల్ రావిపూడి. ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. అంతే కాదు వెంకీలో వున్న సింగర్ ను బయటకు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మరోసారి ఆ ప్రయోగం మెగాస్టార్ తో చెయ్యబోతున్నాడనే టాక్.
2026 సంక్రాంతికి రిలీజ్ అయ్యే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చిరుతో ఓ మాస్ సాంగ్ పాడించబోతున్నాడంటా. ఇప్పటికే మ్యూజిక్ కూడా స్టార్ట్ అయిందంటున్నారు. మరి చిరు గతంలో కొన్ని పాటలు ఆల్రెడీ పాడారు. ఇందులో మాస్ సాంగ్ ఎలా పాడారో చూడాలంటే సాంగ్ వచ్చే వరకు వెయిట్ చెయ్యాలసిందే.