NTR – MAD Square : బామ్మర్ది కోసం బావ.. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్.. ఎన్టీఆర్ గెస్ట్ గా..? ఎప్పుడంటే..
ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.

NTR Will be Guest for Mad Square Movie Success Meet Rumors goes Viral
NTR – MAD Square : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా మ్యాడ్ స్క్వేర్. సూపర్ హిట్ సినిమా మ్యాడ్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫుల్ కాలేజీ స్టోరీ కామెడీతో మ్యాడ్ సినిమాలో నవ్వించగా కాలేజీ అయ్యాక ఓ మూడేళ్ళ తర్వాత ఏం జరిగిందని ఈ సీక్వెల్ లో నవ్వించారు.
మ్యాడ్ స్క్వేర్ సినిమా మార్చ్ 28న రిలీజయి పెద్ద హిట్ అయింది. థియేటర్స్ లో ప్రేక్షకులని ఫుల్ గా నవ్విస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. త్వరలో ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ప్రమోషన్స్ కూడా భారీగా చేయగా ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారని సమాచారం.
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ ఏప్రిల్ 4 న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో చేయనున్నారట. ఈ సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రానున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే కనక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. గతంలో మ్యాడ్ సినిమాకు ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఇటీవలే ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లి అక్కడ దేవర రిలీజ్ ప్రమోషన్స్ చేసొచ్చారు.
ఇండియాలో ఎన్టీఆర్ మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయిపోయింది. దేవర రిలీజ్ సమయంలో కూడా ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదు. దీంతో ఎన్టీఆర్ ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మ్యాడ్ సక్సెస్ మీట్ కి తన బామ్మర్ది నార్నె నితిన్ కోసం, అలాగే నిర్మాత నాగవంశీ కోసం ఎన్టీఆర్ వస్తున్నాడని తెలుస్తుంది.