Nagababu – Chiranjeevi : పవన్ లాగే.. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక.. అన్నయ్య వద్దకు.. తమ్ముడిని అభినందించిన మెగాస్టార్.. ఫోటోలు వైరల్..

నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక వెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.

Nagababu – Chiranjeevi : పవన్ లాగే.. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక.. అన్నయ్య వద్దకు.. తమ్ముడిని అభినందించిన మెగాస్టార్.. ఫోటోలు వైరల్..

Nagababu Meets Megastar Chiranjeevi after MLC Oath Ceremony Photos goes Viral

Updated On : April 2, 2025 / 8:32 PM IST

Nagababu – Chiranjeevi : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా నేడు బుధవారం శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో నాగబాబుకి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Nagababu : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఫోటోలు వైరల్..

నాగబాబు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక వెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. దీంతో చిరంజీవి, భార్య సురేఖ కలిసి నాగబాబుకు పూల దండ వేసి సత్కరించి అభినందించారు. తమ్ముడికి ఒక ఖరీదైన పెన్ కూడా గిఫ్టుగా ఇచ్చారు చిరంజీవి. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – అన్నయ్య, వదిన అంటూ పోస్ట్ చేసారు చిరంజీవి.

Nagababu Meets Megastar Chiranjeevi after MLC Oath Ceremony Photos goes Viral

దీంతో నాగబాబుని చిరంజీవి అభినందించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, జనసేనని 100 శాతం గెలిపించిన తర్వాత ఎలాగైతే చిరంజీవి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడో నాగబాబు కూడా అలాగే ఎమ్మెల్సీ అయ్యాక అన్నయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు, అన్నదమ్ముల బంధం అంటే ఇదే అని ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.