Mega 156 : మెగా 156.. ఈ సంక్రాంతికి టైటిల్.. వచ్చే సంక్రాంతికి సినిమా.. మెగాస్టార్ టార్గెట్ ఇదే..

చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా ప్రస్తుతం మెగా 156 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

Mega 156 : మెగా 156.. ఈ సంక్రాంతికి టైటిల్.. వచ్చే సంక్రాంతికి సినిమా.. మెగాస్టార్ టార్గెట్ ఇదే..

Chiranjeevi Mega 156 Movie Update on this Sankranthi

Updated On : January 14, 2024 / 3:12 PM IST

Mega 156 : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చివరి సినిమా భోళాశంకర్ పరాజయం పాలవడంతో నెక్స్ట్ సినిమా కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా ప్రస్తుతం మెగా 156 ‘బింబిసార’ ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమం నిర్వహించి, షూటింగ్ ని కూడా మొదలుపెట్టేశారు. సినిమా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలుపెట్టారు. వసిష్ఠ – చిరంజీవి మెగా మాస్ యూనివర్స్ ని దాటి అంటూ సోషియో ఫాంటసీ సినిమా అని చెప్పడంతో మెగా 156 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, చంద్రబోస్ పాటలు రాయనున్నారు.

తాజాగా మెగా 156 సినిమాపై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ సంక్రాంతి కానుకగా రేపు జనవరి 15న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ టైటిల్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెడతారని వార్తలు వచ్చాయి. మరి అదే టైటిల్ ఉంటుందా లేక ఇంకేదైనా రివీల్ చేస్తారా చూడాలి. ఇక మెగా 156 సినిమా వచ్చే సంక్రాంతి బరిలో నిలవనుంది టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Also Read : Allu Arjun – NTR : మెగా సెలబ్రేషన్స్‌కి అల్లు అర్జున్.. నందమూరి బ్రదర్స్ స్పెషల్ విషెస్..

గత సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి భారీ హిట్ కొట్టిన చిరంజీవి ఈ సంక్రాంతికి మెగా 156 సినిమా టైటిల్ ప్రకటించి వచ్చే సంక్రాంతికి మళ్ళీ సినిమాతో బరిలో నిలవనున్నారు. దీంతో మెగాస్టార్ గట్టిగానే వచ్చే సంక్రాంతిని ఇప్పట్నుంచే టార్గెట్ చేశారని తెలుస్తుంది.