Mega 157 : చిరంజీవి, వసిష్ఠ సినిమా మొదలయ్యేది అప్పుడేనా..?

చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్టతో చేయబోతున్న Mega 157 మూవీ షూటింగ్ మొదలుపెట్టుకునేది..

Mega 157 : చిరంజీవి, వసిష్ఠ సినిమా మొదలయ్యేది అప్పుడేనా..?

Chiranjeevi Mega 157 movie shooting starts from November

Mega 157 : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. సోషియో ఫాంటసీ కథతో ఈ మూవీ తెరకెక్కబోతుందని తెలుస్తుంది. యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tiger Nageswara Rao : టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఫస్ట్ సింగల్ రిలీజ్.. గ‌జ‌దొంగ‌నే ప్రేమలో పడేసిన..

తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ విషయం గురించి ఒక వార్త ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. పక్కా ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని పట్టాలు ఎక్కించడానికి దర్శకుడు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. కాగా చిరంజీవి గతంలో ‘అంజి’ సినిమాతో ఇలాంటి కథలో నటించాడు. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక నేపథ్యంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Pawan Kalyan Video: ఇండియా పేరు మార్పు.. చిరంజీవి, రాజమౌళి ఎదుట నిలబడి పవన్ చేసిన కామెంట్స్ వైరల్

ఇది ఇలా ఉంటే, 156వ సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది అనేది తెలియడం లేదు. చిరు కూతురు సుస్మిత కొణిదెల (Susmita Konidela) నిర్మాణంలో ఈ మూవీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ మూవీకి సంబంధించిన ఏ వివరాలను తెలియజేయలేదు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యిన దగ్గర నుంచి.. రీమేక్ చిత్రంగా తెరకెక్కబోతుందని టాక్ వినిపించింది. అయితే భోళాశంకర్ ప్లాప్ తరువాత చిరు అండ్ 156 టీం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా పై అప్డేట్ చిరు ఎప్పుడు ఇస్తాడో చూడాలి.