Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగా ఛాన్స్‌ని మిస్ యూజ్ చేసుకున్న మెహర్ రమేష్?

తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ నేడు ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగా ఛాన్స్‌ని మిస్ యూజ్ చేసుకున్న మెహర్ రమేష్?

Chiranjeevi Meher Ramesh Bholaa Shankar Movie Review and Rating

Updated On : August 11, 2023 / 12:18 PM IST

Bholaa Shankar Review : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh), అక్కినేని హీరో సుశాంత్(Sushanth) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్(Bholaa Shankar). అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మిస్తున్న ఈ సినిమాని మెహర్ రమేష్(Meher Ramesh) డైరెక్ట్ చేశాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ నేడు ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

కథ విషయానికి వస్తే దందాలు చేసుకుంటూ ఉండే భోళా శంకర్ ఓ దందాలో భాగంగా కీర్తి సురేష్ ని కలుస్తాడు. అలంటి సమయంలో కీర్తిని ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళు తీసుకెళ్తే కాపాడి ఆ తర్వాత చిరంజీవి ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళని ఎలా అంతం చేశాడు అనేదే కథ. అయితే కీర్తి చిరంజీవికి ఎలా చెల్లి అయింది? చిరంజీవి ఉమెన్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ మధ్యలో లాయర్ తమన్నా చిరు ప్రేమలో ఎలా పడింది? తమన్నా అన్నయ్య సుశాంత్ కీర్తి సురేష్ తో ప్రేమ ఎలా అంటే తెరపైనే చూడాల్సిందే.

కథనం అయితే సరిగ్గా లేకుండా సాగింది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ, యాక్షన్ సీన్స్ బాగున్నా అక్కడక్కడా మరీ క్రింజ్ కామెడీ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కామెడీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పడానికి చాలా సమయం తీసుకొని సాగదీసాడు. ఏ సినిమాకి అయినా ఫ్లాష్ బ్యాక్ ప్లస్ అవ్వాలి. కానీ ఇక్కడ అదే మైనస్ అయింది. సాంగ్స్ సంబంధం లేకుండా ఉంటాయి. అక్కడక్కడా అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ సాంగ్స్, సీన్స్ పెట్టినా అవి కూడా వర్కౌట్ అవ్వలేదు.

సినిమా ప్లస్ లు.. చిరంజీవి యాక్టింగ్, కొన్ని యాక్షన్ సీన్స్, ఎలివేషన్ BGM
మైనస్ లు.. కామెడీ, స్క్రీన్ ప్లే, సాంగ్స్, ఫ్లాష్ బ్యాక్, టెక్నికల్ వ్యాల్యూస్

Bholaa Shankar : చిరంజీవి భోళాశంకర్ ట్విట్టర్ రివ్యూ.. థియేటర్‌లో భోళా మ్యానియా ఎలా ఉంది..?

ఒకప్పుడు అన్ని ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ కి 10 ఏళ్ళ తర్వాత చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చినా మెహర్ రమేష్ సినిమా తీసి ఇచ్చిన ఛాన్స్ నిలబెట్టుకోలేదనే చెప్పాలి.