Chiranjeevi Nagarjuna and Amitabh Bachchan in ANR National Award 2024 pics viral
ఒకే వేదిక పై ముగ్గురు స్టార్స్ నిలబడితే చూడడానికి రెండు కళ్లు చాలవు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున ఒకే వేదిక పై చూస్తే.. ఆ ఫీలింగ్ చెప్పడానికి మాటలు చాలదు. ఇందుకు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికైంది.
Nagarjuna : నాన్నగారు పిలిచి.. చిరంజీవి డ్యాన్స్ చూడమని చెప్పారు.. ఆయన గ్రేస్ చూసి టెన్షన్..
సోమవారం ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. 2024గానూ ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి అందజేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరు ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమం కోసం ముగ్గురు ఒకే వేదిక పైకి వచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.
ఇక ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ ముగ్గరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని కొందరు ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి తల్లి అంజనాదేవి, దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, నాని, రమ్యకృష్ణ, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.