Movie Stars : అన్ని పరిశ్రమల స్టార్స్ ఒకే ఫొటోలో.. చిరు, రజినీకాంత్ తో సహా.. ముంబై ఈవెంట్లో.. ఫోటో వైరల్..
ఇండియా వైడ్ పలువురు స్టార్స్ ఒకే ఫొటోలో కనిపిస్తుంటే ఆ ఫోటో మరింత వైరల్ అవ్వాల్సిందే.

Chiranjeevi Rajinikanth Mohan Lal Akshay Kumar and Some Other Movie Stars in Single Frame from Waves Summit
Movie Stars : ఒకరిద్దరు హీరోలు, స్టార్స్ కనిపిస్తేనే ఆ ఫోటో వైరల్ గా మారి ఫ్యాన్స్ సంతోషిస్తారు. అలాంటిది ఇండియా వైడ్ పలువురు స్టార్స్ ఒకే ఫొటోలో కనిపిస్తుంటే ఆ ఫోటో మరింత వైరల్ అవ్వాల్సిందే. ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్) – 2025 కార్యక్రమం నేడు ముంబైలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నారు. అయితే ఇండియన్ సినీ పరిశ్రమ నుంచి కూడా అనేకమంది స్టార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మన టాలీవుడ్ నుంచి నేడు మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగార్జున, రాజమౌళి.. మరికొంతమంది స్టార్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
Also See : Hit 3 Success Celebrations : నాని హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్.. రంగులతో హంగామా..
తాజాగా ఈ వేవ్స్ సమ్మిట్ నుంచి అన్ని పరిశ్రమల నుంచి స్టార్స్ ఉన్న ఓ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ నుంచి మిథున్ చక్రవర్తి, హేమమాలిని, అక్షయ్ కుమార్ తమిళ్ నుంచి రజినీకాంత్, తెలుగు నుంచి చిరంజీవి, మలయాళం నుంచి మోహన్ లాల్.. ఇలా స్టార్స్ అంతా ఒకే చోట కలిసి కనపడటంతో ఫ్యాన్స్, సినీ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Retro : సూర్య ‘రెట్రో’ మూవీ రివ్యూ.. 90s బ్యాక్ డ్రాప్ తో..